Prabhas : భీముడిగా ప్రభాస్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రాజాసాబ్‌ తో బిజీగా ఉన్న

Prabhas Another Movie With Hit Director

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రాజాసాబ్‌ సినిమాలో బిజీగా ఉన్న డార్లింగ్‌ ఈ ఇయర్ ఎండింగ్‌లో స్పిరిట్ మూవీని ట్రాక్‌ ఎక్కించబోతున్నాడట. ఆ తర్వాత ఓ కొత్త రోల్‌లో ప్రభాస్ (Prabhas) కనిపించబోతున్నట్లు ఫిల్మ్‌ నగర్ వర్గాల టాక్. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ( Koratala Siva)తో గతంలో మిర్చి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్..మళ్లీ ఆ దర్శకుడితో జత కట్టబోతున్నాడట.

ఈ సారి కొరటాల స్క్రిప్ట్‌లో ప్రభాస్ భీముడి పాత్రలో యాక్ట్ చేయబోతున్నట్లు గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. మహాభారతం నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామాగా ఈ పిక్చర్ రూపొందనుందని, ప్రభాస్ లుక్ కోసం స్పెషల్ టీమ్ ఇప్పటికే వర్క్ స్టార్ట్ చేసిందని టాక్. ఈ కాంబో మళ్లీ మిర్చి మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.

Vishwambhara : ‘విశ్వంభర’ అప్డేట్ ఇచ్చిన మెగాస్టార్.. వీడియో వైరల్.. రిలీజ్ ఎప్పుడంటే..

కొరటాల శివ, టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆచార్యతో నిరాశపరిచాడు. అయినా ప్రభాస్ మళ్లీ అతడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్. ఈ కొత్త ప్రాజెక్ట్‌లో కొరటాల తన మార్క్ సోషల్ మెసేజ్‌తో పాటు మాస్ ఎలిమెంట్స్‌ను జోడించి మరో శ్రీమంతుడు లాంటి హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ బ్యాంకింగ్ ఉంటుందని, భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందనుందని సమాచారం.

మిర్చి సినిమాతో ప్రభాస్‌ను స్టైలిష్ మాస్ హీరోగా మార్చిన కొరటాల శివ, ఈ సారి మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఈ కొత్త సినిమాలో ప్రభాస్ భీముడి పాత్రలో కనిపించనున్నాడని, ఇది ఓ ఎపిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని టాక్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తైందని ప్రచారం జరుగుతోంది. డార్లింగ్, కొరటాల మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.