Prabhas: “రాజు ఏ పరిస్థితిలో ఉన్నా రాజే”.. ప్రభాస్ ని పొగుడుతున్న నెటిజెన్లు!

ప్రభాస్ పెద్దనాన్న, టాలీవుడ్ రియల్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం ఉదయం అనారోగ్య సమస్యలతో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పెద్దనాన్న కృష్ణంరాజును కడసారి చూడడానికి వచ్చిన అభిమానుల కోసం ప్రభాస్ చేసిన పని చూసి అభిమానులతో పాటు సాటి కళాకారులు కూడా శభాష్ అంటున్నారు. అదేంటంటే...

Prabhas Arranged Food for Fan's at Krishnam Raju Funneral

Prabhas: ప్రభాస్ పెద్దనాన్న, టాలీవుడ్ రియల్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం ఉదయం అనారోగ్య సమస్యలతో మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం ఆయన పార్థివదేహాన్ని మొయినాబాద్ ఫామ్ హౌస్ కు ప్రభుత్వ లాంఛనాల మధ్య అంతిమయాత్రగా తీసుకువెళ్లగా, క్షత్రియ సంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు ముగిసాయి.

Prabhas To Burn Ravan Effigy : ప్రభాస్‌కు అరుదైన గౌరవం.. ఢిల్లీ రాంలీలా మైదానంలో రావ‌ణ ద‌హ‌నానికి ఆహ్వానం

కృష్ణంరాజు తుది వీడుకోలు పలకడానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా భారీగా తరలి వచ్చారు. అయితే పెద్దనాన్న కృష్ణంరాజును కడసారి చూడడానికి వచ్చిన అభిమానుల కోసం ప్రభాస్ చేసిన పని చూసి అభిమానులతో పాటు సాటి కళాకారులు కూడా శభాష్ అంటున్నారు. అదేంటంటే అంత్యక్రియలకు వచ్చిన అభిమానుల కోసం భోజనాలు ఏర్పాటు చేసాడట.

“ప్రభాస్ అన్నా.. నువ్వు ఉన్న పరిస్థితిలో ఎవరూ ఫాన్స్ గురించి ఆలోచించరు, కానీ నిన్న వచ్చిన ప్రతి అభిమానికి నువ్వు అన్నం పెట్టి పంపావు చూడు”.. అంటూ ఒక మహేష్ బాబు అభిమాని ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేయగా, “రాజు ఎక్కడున్నా రాజే” అనే బాహుబలి డైలాగ్ తో కామెంట్ లు చేస్తున్నారు నెటిజెన్లు. ఇక డార్లింగ్ ఫాన్స్ అయితే దుఃఖంలో ఉన్న ప్రభాస్ ని చూసి బాధపడుతున్నారు.