Prabhas To Burn Ravan Effigy : ప్రభాస్‌కు అరుదైన గౌరవం.. ఢిల్లీ రాంలీలా మైదానంలో రావణ దహనానికి ఆహ్వానం
ఆదిపురుష్ మూవీలో రాముడి పాత్రను పోషిస్తున్న హీరో ప్రభాస్..ఈ ఏడాది ఢిల్లీలోని లవ్‌కుశ్ రాంలీలా మైదానంలో రావణ దహనం చేయనున్నారు. లవ్‌కుశ్ రాంలీలా కమిటీ ప్రభాస్‌ను కలిసి అక్టోబర్ 5న దసరా సందర్భంగా రావణుడి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ముఖ్య అతిధిగా హాజరు కావాలని ఆహ్వానించింది.

Prabhas To Burn Ravan Effigy
Prabhas To Burn Ravan Effigy : ఆదిపురుష్ మూవీలో రాముడి పాత్రను పోషిస్తున్న హీరో ప్రభాస్..ఈ ఏడాది ఢిల్లీలోని లవ్‌కుశ్ రాంలీలా మైదానంలో రావణ దహనం చేయనున్నారు. లవ్‌కుశ్ రాంలీలా కమిటీ ప్రభాస్‌ను కలిసి అక్టోబర్ 5న దసరా సందర్భంగా రావణుడి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ముఖ్య అతిధిగా హాజరు కావాలని ఆహ్వానించింది.
సెప్టెంబర్ 26 నుంచి దసరా వేడుకలు ప్రారంభం కానుండగా ఈ ఏడాది కమిటీ ఎర్రకోట వద్ద అయోధ్యలోని రామాలయం థీమ్‌పై మండపాన్ని ఏర్పాటు చేస్తోంది. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా రావణుడి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ఆదిపురుష్‌లో రాముడిగా నటిస్తున్న ప్రభాస్ కంటే మెరుగైన వారు ఎవరుంటారని లవ్‌కుశ్ రాంలీలా కమిటీ చీఫ్ అర్జున్ కుమార్ తెలిపారు.
ట్రెడీషన్‌లో టెక్నాలజీ : రిమోట్‌తో రావణ దహనం
రావణుడు, కుంభకర్ణుడు, మేఘ్‌నాధ్ దిష్టిబొమ్మలను ప్రభాస్ బాణంతో దగ్ధం చేస్తారని పేర్కొన్నారు. గతంలో అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గన్, జాన్ అబ్రహం వంటి నటులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఓంరౌత్ నిర్ధేశకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా కృతి సనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.