Prabhas : ప్రభాస్ కామెడీ టైమింగ్ మాములుగా లేదుగా.. ఈ వీడియో చూసారా?

గతంలో పలుమార్లు ఇంటర్వ్యూలలో ప్రభాస్ తన పంచ్ లతో ప్రేక్షకులని నవ్వించాడు. ఇప్పుడు మత్తు వదలరా 2 టీమ్ ని ఒక ఆట ఆడుకున్నాడు.

Prabhas Comedy Timing goes Viral in Mathu Vadalara 2 Trailer Launch

Prabhas : ప్రభాస్ ఇటీవల హను రాఘవపూడి సినిమా ఓపెనింగ్ లో కనిపించాడు. తాజాగా మత్తు వరదాలరా 2 సినిమా ట్రైలర్ లాంచ్ ప్రభాస్ చేతుల మీదుగా జరిగింది. ఈ సినిమా టీమ్ ప్రభాస్ దగ్గరకు వెళ్లగా ప్రభాస్ వచ్చి ట్రైలర్ లాంచ్ చేసాడు. ప్రభాస్ చాలా సైలెంట్ గా ఉంటాడు, కానీ మాట్లాడటం మొదలు పెడితే పంచ్ లు, కౌంటర్ లు పడతాయని తెలిసిందే.

గతంలో పలుమార్లు ఇంటర్వ్యూలలో ప్రభాస్ తన పంచ్ లతో ప్రేక్షకులని నవ్వించాడు. ఇప్పుడు మత్తు వదలరా 2 టీమ్ ని ఒక ఆట ఆడుకున్నాడు. ట్రైలర్ లాంచ్ అంటే లంచ్ ఎందుకు డిన్నర్ చేసేద్దాం అని, ట్రైలర్ లోడ్ అవుతుంటే ఇది ఇవాళ్టికి వస్తదా అని, ఫరియా నిల్చుంటే ఈమె ఏంటి ఇంత ఉంది అంటూ.. ఇలా వరుసగా పంచులేసి ప్రేక్షకులని నవ్వించాడు. మూవీ టీమ్ ప్రభాస్ ట్రైలర్ లాంచ్ చేస్తూ కామెడీ చేసిన వీడియోని రిలీజ్ చేయగా ఈ వీడియో వైరల్ గా మారింది.

Also Read : Ramnagar Bunny : ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మళ్ళీ వచ్చేసాడు.. ‘రామ్ నగర్ బన్నీ’ గ్లింప్స్ రిలీజ్..

ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియోని చూసి అన్న ఏం మారలేదు, టైం దొరికితే తనలోని కామెడీ యాంగిల్ ని బయటకు తెస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ప్రభాస్ తన కామెడీ పంచులతో మరోసారి వైరల్ అవుతున్నాడు. మీరు కూడా ట్రైలర్ లాంచ్ లో ప్రభాస్ చేసిన అల్లరి చూసేయండి..