Prabhas Completed 22 Years Career as Hero Rebel Star to Pan India Star Journey
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా భారీ సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. దేశవిదేశాల్లో ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చి నేటికి 22 ఏళ్ళు అవుతుంది. ప్రభాస్ నట ప్రస్థానం నేటికి 22 ఏళ్లకు చేరుకుంది. 2002 నవంబర్ 11న ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
మొదటి సినిమాతో మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయి ఆ తర్వాత వరుస సినిమాలతో మంచి స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. రాఘవేంద్ర, వర్షం, అడవిరాముడు, చక్రం సినిమాలతో క్లాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయిన ప్రభాస్ ఛత్రపతి సినిమాతో మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యాడు. పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా సినిమాలతో కలెక్షన్స్ భారీగా రప్పించాడు. ఏక్‌నిరంజన్, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, రెబల్, మిర్చి సినిమాలతో అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా తెచ్చుకున్నాడు.
ఇక ప్రభాస్ జర్నీ మిర్చి వరకు ఒక ఫేజ్ అయితే బాహుబలితో పాన్ ఇండియా జర్నీ బిగిన్ చేసాడు. బాహుబలి రెండు సినిమాలతో ఇంటర్నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. సాహో, సలార్, ఆదిపురుష్, కల్కి 2898ఎడి సినిమాలతో భారీ కలెక్షన్స్ తెచ్చి ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా నిలిచాడు. వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ కూడా తెప్పించి కలెక్షన్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచాడు. కలెక్షన్స్ తో పాటు బోలెడన్ని రికార్డులు ప్రభాస్ సొంతం. ఓవర్‌సీస్ మార్కెట్‌లో పది మిలియన్లకు పైగా వసూళ్లను సాధించిన తొలి తెలుగు హీరోగా ప్రభాస్ నిలిచారు.
Also Read : Sandeep Raaj : నిశ్చితార్థం చేసుకున్న యువ డైరెక్టర్.. ఆ నటితో ప్రేమలో పడి..
ప్రభాస్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా సినిమాలు లైనప్ చేసుకున్నారు. మారుతి డైరెక్షన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ది రాజా సాబ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న సలార్ 2, సందీప్ వంగా దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మిస్తున్న స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాతో పాటు హోంబలెతో మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఇవి కాక లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో కూడా సినిమాలు చేస్తున్నాడని టాక్ నడుస్తుంది. బాలీవుడ్ లో కూడా ఓ సినిమా ఓకే చేసాడని సమాచారం.
అసలు ఏ స్టార్ హీరోకి లేనన్ని ప్రాజెక్ట్స్ ప్రభాస్ చేతిలో ఉన్నాయి. ఆల్మోస్ట్ 10 భారీ సినిమాల వరకు ప్రభాస్ ప్లాన్ చేసుకొని ఉన్నాడు. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో భాగస్వామ్యంగా ఉన్నాడు. మరో వైపు ఇటీవలే తన బ్రదర్ ప్రమోద్ తో కలిసి ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ అనే సంస్థ పెట్టి కొత్త రచయితలకు అవకాశం ఇవ్వనున్నాడు. ఇలా ప్రభాస్ టాలీవుడ్ కి సమాంతరంగా ఇంకో ఇండస్ట్రీనే నడిపిస్తున్నాడుగా అని ఫ్యాన్స్, నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇక ప్రభాస్ మర్యాదల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇంటికి వెళ్తే కడుపునిండా ఫుడ్ పెట్టి పంపిస్తారు. తన సినిమాలో వచ్చే నటీనటులకు ఇంటి నుంచి భారీగా ఫుడ్ తెచ్చి పెడతాడు. ప్రభాస్ ఫుడ్, మర్యాదల గురించి చాలా మంది యాక్టర్స్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. మొత్తానికి 22 ఏళ్ళల్లో కృష్ణంరాజు వారసుడు నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ప్రభాస్.