Sandeep Raaj : నిశ్చితార్థం చేసుకున్న యువ డైరెక్టర్.. ఆ నటితో ప్రేమలో పడి..
నటి చాందిని రావుతో సందీప్ రాజ్ నేడు నిశ్చితార్థం చేసుకున్నాడు.

Director Sandeep Raaj Engaged with Actress Chandini Rao Photos goes Viral
Sandeep Raaj : షార్ట్ ఫిలింతో బాగా పాపులారిటీ తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రాజ్ కలర్ ఫొటో సినిమాతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించి ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాలు, సిరీస్ లకు రచయితగా పనిచేస్తూనే తన నెక్స్ట్ సినిమాని పట్టాలెక్కిస్తున్నాడు. తాజాగా ఈ యువ డైరెక్టర్ నిశ్చితార్థం చేసుకున్నాడు.
Also See : director krish – Dr Priti Challa : రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ క్రిష్.. ఫొటోలు వైరల్..
నటి చాందిని రావుతో సందీప్ రాజ్ నేడు నిశ్చితార్థం చేసుకున్నాడు. షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ ఇప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగానే ఉంది చాందిని. షార్ట్ ఫిలిమ్స్ అప్పట్నుంచే వీరికి పరిచయం ఉండగా ఆ పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. సందీప్ – చాందిని తమ నిశ్చితార్థం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పలువురు నెటిజన్లు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోనున్నారు.