Prabhas: ఏపీ వరద బాధితులకు ప్రభాస్ రూ.కోటి విరాళం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాల వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.

Prabhas: ఏపీ వరద బాధితులకు ప్రభాస్ రూ.కోటి విరాళం

Prabhas (1)

Updated On : December 7, 2021 / 12:12 PM IST

Prabhas: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాల వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ప్రజలు వరదల్లో చిక్కుకున్న వేళ సినీ ప్రముఖులు తమ వంతుగా చేయూతనిస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు.

ముఖ్యంగా ఆపద అంటే ముందుండే సినీతారులు మరోసారి స్పందిస్తూ విరాళాలు అందజేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా సినీనటుడు ప్రభాస్ కూడా తన వంతుగా వరద బాధితులకు సహాయంగా రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు.

సామాజిక కార్యక్రమాల్లో ముందుండే ప్రభాస్ గతంలో కరోనా సమయంలోనూ, హైదరాబాద్ నగరం వరదల్లో మునిగినప్పుడు కూడా తన వంతుగా సహాయం అందించారు. లేటెస్ట్‌గా ఇప్పుడు కూడా వరదల్లో బాధపడుతున్నవారికి అండగా నిలవడానికి కోటి రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తున్నట్లు ప్రకటించాడు.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, నాగార్జునతో సహా పలువురు సినీ పరిశ్రమ నుంచి విరాళాలు ప్రకటించారు.