Puneeth
Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం చెందిన సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్ 29న ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు మాత్రమే కాదు కన్నడ ప్రజలకు కూడా తీరని లోటు. ఆయన మరణం తర్వాత నేటికీ ఆయన అభిమానులు, కన్నడ ప్రజలు, ఎంతో మంది ప్రముఖులు ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు.
అయితే ఆయన నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఫిబ్రవరి 11న ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ చూశాక ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ లా సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా, శ్రీకాంత్ విలన్‌గా నటించారు. చేతన్ కుమార్ దర్శకత్వం వహించారు.
Keerthy Suresh : కూకట్‌పల్లిలో కీర్తి సురేష్ సందడి.. టాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ స్టోర్ ఓపెనింగ్..
ఈ సందర్భంగా పునీత్‌ను గుర్తు చేసుకుంటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎమోషనల్ గా తన ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు. పునీత్ నటించిన ‘జేమ్స్’ సినిమా పోస్టర్ ని షేర్ చేసి..”జేమ్స్ రూపంలో మనం అద్భుతమైన కళాఖండాన్ని చూడబోతున్నాం. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సర్‌ని అభిమానించే లక్షలాది మందికి ఈ చిత్రం ఎప్పుడూ ప్రత్యేకమైనదే. వుయ్ మిస్ యూ సర్’’ అంటూ పోస్ట్ చేశాడు. దీంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పునీత్ పై పోస్ట్ చేయడంతో పునీత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.