Salaar : ‘సలార్’ సినిమా నుంచి అభిమానుల సందేహాలు.. ప్రశాంత్ నీల్ భార్య సమాధానాలు..

తాజాగా ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డి(Likhitha Reddy) తన సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తో సలార్ సినిమా గురించి చిట్ చాట్ నిర్వహించగా ఫాలోవర్లు, ప్రభాస్ అభిమానులు ప్రశ్నలు అడిగారు.

Salaar : ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) ‘సలార్’ సినిమాతో వచ్చి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్స్ లో పెద్ద హిట్ అయి దాదాపు 700 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. సలార్ విజయంతో ప్రభాస్ అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఇక దీనికి పార్ట్ 2 కూడా ప్రకటించారు. ‘సలార్ శౌర్యంగపర్వం’ అనే టైటిల్ తో పార్ట్ 2 రానుంది. ఆల్రెడీ సలార్ 2 సగం పైగా షూటింగ్ కూడా అయిపోయిందని సమాచారం.

ఇటీవల సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా గ్రాండ్ గా చేసుకున్నారు. తాజాగా ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డి(Likhitha Reddy) తన సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తో సలార్ సినిమా గురించి చిట్ చాట్ నిర్వహించగా ఫాలోవర్లు, ప్రభాస్ అభిమానులు ప్రశ్నలు అడిగారు. అభిమానులు సలార్ 2 సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. సలార్ పార్ట్ 1 చూసిన తర్వాత ప్రేక్షకులకు సినిమా గురించి, సినిమాలో పాత్రలు, సీన్స్ గురించి చాలా సందేహాలు ఉన్నాయి. వాటిని పార్ట్ 2 లోనే చూపిస్తారని అంతా భావిస్తున్నారు. తాజాగా ఈ సందేహాలన్నీ లిఖితని అడిగేసారు అభిమానులు. వీటికి ప్రశాంత్ నీల్ భార్య లిఖిత సమాధానాలు ఇచ్చింది.

Also Read : Syamala Devi : ప్రభాస్ జాతకం ఆయనకెలా తెలుసు?.. ప్రభాస్ పెద్దమ్మ కామెంట్స్..

 

అభిమానులు అడిగిన ప్రశ్నలు – లిఖిత ఇచ్చిన సమాధానాలు ఇవే ..

అభిమానుల ప్రశ్న : దేవా(ప్రభాస్) తండ్రిగా పార్ట్ 2లో ఎవరు కనిపించబోతున్నారు?

లిఖిత సమాధానం : శౌర్యంగా పర్వంలో దేవా తండ్రి పాత్ర ఎవరా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను.

ట్రైలర్ లో చూపించిన కొన్ని సీన్స్, జురాసిక్ పార్క్ డైలాగ్ గురించి చెప్పండి..

శౌర్యంగపర్వం రిలీజ్ అయ్యాక మీరే చూస్తారు.

అఖిల్ సలార్ పార్ట్ 2లో నటిస్తాడని రూమర్ ఉంది?

అది నిజంగా రూమరే

దేవాకి తన తండ్రిని రాజమన్నార్ చంపాడని అతనికి తెలుసా?

మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది.

పండిట్ రోల్ గురించి ఇంకా తెలుసుకోవాలి?

మీరు పార్ట్ 1లో చూసింది కొంచెమే.

దేవా, వరద శత్రువులుగా మారడానికి కారణం ఏంటి?

మీరేం అనుకుంటున్నారు?

పార్ట్ 2 షూట్ చేసారా?

డైనోసార్

దేవా శౌర్యంగ తెగకు చెందినవాడని తెలిసి కూడా వరద ఎందుకు చంపలేదు?

అన్నిటికంటే స్నేహం గొప్పది

కృష్ణకాంత్ దేవకు, బిలాల్ కి ఇచ్చిన ప్రామిస్ ఏంటి?

అది నెక్స్ట్ పార్ట్ లో చూడాల్సిందే. బాగా అబ్జర్వ్ చేశారు

ఖాన్సార్ సింహాసనంపై కూర్చునే అర్హత దేవాదే అని అతనికి తెలుసా ?

ఈ సమాధానం కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు, నేను కూడా

దేవా, రాధారమ, ఆద్యకు మధ్య ఉన్న సంబంధం ఏంటి?

దీనికి సమాధానం చెప్పాలంటే శౌర్యంగపర్వం స్క్రిప్ట్ నేను దొంగలించాలి

సీజ్ ఫైర్ లో మాస్ సాంగ్ మిస్ అయింది, పార్ట్ 2లో అయినా ఉంటుందా?

తప్పకుండా ఉంటుంది

బిలాల్ పాస్ట్ లో వరద దగ్గర ఉంటాడు, కానీ ప్రజెంట్ దేవా దగ్గర ఎందుకు ఉంటాడు?

గుడ్ అబ్జర్వేషన్

సలార్ పార్ట్ 3 కూడా ఉంటుందా?

పార్ట్ 2 క్లైమాక్స్ లో దానికి సమాధానం దొరుకుతుంది.

డైనోసార్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే

కొన్ని తరాల పాటు మాట్లాడుకుంటారు.

దేవా వాళ్ళ అమ్మ ఒక సీన్ లో కడుపుతో ఉన్నట్టు చూపించారు. దేవాకు తమ్ముడు ఉండొచ్చు?

ఏమో నేను గమనించలేదు

సలార్ పార్ట్ 1 క్లైమాక్స్ లో ప్రభాస్ శరీరం పచ్చరంగులోకి మారడానికి కారణం ఏంటి?

శౌర్యంగల తెగ రంగు అది.

దేవాకు ఎక్కువగా డైలాగ్స్ లేవెందుకు?

అతని నీడే మిలియన్ డైలాగ్స్ కి సమానం కాబట్టి

ఖాన్సార్ సీల్ సృష్టించింది దేవానే అయినప్పుడు అతడు ఖాన్సార్ లో ఎందుకు లేడు?

దేవా దాన్ని సృష్టించి వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడానికి కారణం పార్ట్ 2లో ఉంటుంది.

దేవా – వరద పాత్రల మధ్య ఫైట్ ఉంటుందా?

ఒక్కసారి ఊహించుకో

దేవాని చూసి ఓబులమ్మ ఎందుకంత భయపడింది?

దీనికి సమాధానం తెలిస్తే మనం కూడా అలాగే భయపడతామేమో

బాహుబలిలో రాజమౌళి గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చినట్టు సలార్ లో కూడా ప్రశాంత్ నీల్ గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తాడా?

అయన నీడ కూడా కనపడదు

దేవా చేతిలో ప్లాస్టిక్ కత్తి చూసి వాళ్ళ అమ్మ భయపడుతుంది, ఇది మరీ ఓవర్ గా లేదా?

అది పార్ట్ 2 చూస్తే మీకు క్లారిటీ వస్తుంది.

ఇలా ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు సలార్ గురించి తమకు ఉన్న సందేహాలన్నీ ప్రశాంత్ నీల్ భార్యని అడగ్గా కొన్నిటికి సమాధానాలిచ్చి, కొన్నిటికి పార్ట్ 2 చూడాల్సిందే అని చెప్పింది. లిఖిత చెప్పిన సమాధానాల బట్టి పార్ట్ 2 షూటింగ్ సగం పైగా అయిపొయింది, అందులో ఒక మాస్ సాంగ్ ఉంటుంది, ప్రభాస్ – పృధ్విరాజ్ ల మధ్య ఫైట్ ఉండొచ్చు అని తెలుస్తుంది. సలార్ పార్ట్ 2 వచ్చే సంవత్సరం చివర్లో రిలీజవుతుందని సమాచారం. ప్రస్తుతం సలార్ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు