యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన క్రేజీయెస్ట్ ఫిలిం.. సాహో మూవీ ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాలని థియేటర్ల వద్ద టికెట్స్ కోసం పడిగాపులు కాస్తున్న అభిమానులు..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటించిన మోస్ట్ అవైటెడ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్.. సాహో.. మరో రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే చాలా చోట్ల బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా టికెట్స్ హాట్ కేక్స్‌లా అయిపోతున్నాయి. ప్రభాస్ క్రేజ్ దృష్ట్యా భారీ థియేటర్స్‌లో సాహోని విడుదల చేస్తున్నారు. ఫ్యాన్స్, ప్రేక్షకులు ధియేటర్స్ దగ్గర టికెట్స్ కోసం గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు.
ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాలనేది ప్రతి ఒక్కరి కోరిక.. హైదరాబాద్‌లోని ఐమాక్స్ వద్ద డార్లింగ్ ఫ్యాన్స్ అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా.. ఒక్క టికెట్ అయినా దొరకకపోతుందా అని ఉదయం నుండి వెయిట్ చేస్తున్నారు. ఐమాక్స్‌లో ఫస్ట్ డే తెలుగు 28 షోలు, హిందీ వెర్షన్ 2 షోలు వేస్తున్నారు. హైదరాబాద్‌లో 29 అర్థరాత్రి షోలకు పర్మిషన్ రావాల్సిఉంది.
Read Also : యుద్ధానికి సిద్ధంకండి – సమరశంఖం నేనూదుతా!
ఏపీ ప్రభుత్వం అదనంగా మరో రెండు షోలకు పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రాలో చాలా చోట్ల 29 అర్థరాత్రి షోలతో పాటు, బెన్‌ఫిట్ షోలు కూడా ప్లాన్ చేస్తున్నారు. సాహో ఇండియా వైడ్ 10 వేల స్క్రీన్స్‌లో విడుదల కానుంది.
Our Darling #Prabhas #DieHardFans at @PRASADIMAX Waiting For #Saaho tickets #SaahoManiaIN2Days #SaahoOnAugust30 #WorldSaahoDay pic.twitter.com/TYHmX2NYRr
— RebelStar Fan (@Kartheek_07) August 28, 2019