యుద్ధానికి సిద్ధంకండి – సమరశంఖం నేనూదుతా!
నేచురల్ స్టార్ నాని, విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న'గ్యాంగ్ లీడర్' థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

నేచురల్ స్టార్ నాని, విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న’గ్యాంగ్ లీడర్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..
నేచురల్ స్టార్ నాని, విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్.. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న సినిమా.. ‘గ్యాంగ్ లీడర్’.. ఈ సినిమా టీజర్, లిరికల్ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.. ఇంగ్లీష్ సినిమాల డివిడిలు చూస్తూ నాని కథ రాయడంతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.
ఫేమస్ రివేంజ్ రైటర్ కాబట్టి అయిదుగురు ఆడవాళ్లు తన దగ్గరకి రావడం, సినిమాలను కాపీ కొట్టి కథలు రాసే ఫ్రాడని తెలుసుకోవడం, ‘మా రైటర్స్ ప్రపంచం అంటే ఇంతే.. ఆకలేస్తే అక్షరాలు తింటాం.. చలేస్తే పుస్తకాలు కప్పుకుంటాం’.. అని నాని బిల్డప్ ఇవ్వడం.. ఇలా ఫన్నీగా స్టార్ట్ అయిన ట్రైలర్ యాక్షన్తో ఎండ్ అవుతుంది. నాని నేచురల్ పర్ఫార్మెన్స్, లక్ష్మీ, శరణ్య, ప్రియా అరుల్ మోహన్, కార్తికేయ తదితరుల నటన, ఆర్ఆర్, విజువల్స్ బాగున్నాయి. సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్ గ్రాండ్గా రిలీజవుతుంది.
Read Also : ఐమాక్స్ దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ సందడి..
అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిషోర్, జైజా, ప్రణ్య, సత్య తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : అనిరుధ్, కెమెరా : మిరోస్లా కూబా బ్రోజెక్, ఎడిటింగ్ : నవీన్ నూలి, డైలాగ్స్ : వెంకీ, డార్లింగ్ స్వామి, ఆర్ట్ : రామ్ కుమార్, సీఈఓ : చిరంజీవి (చెర్రీ).