Prabhas Fans Stopped Sandeep Reddy Vanga Car at Bhimavaram and talk about Spirit Movie
Sandeep Reddy Vanga : డైరెక్టర్ సందీప్ వంగ ఇటీవల యానిమల్(Animal) సినిమాతో భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నాన్న సెంటిమెంట్, లవ్ ఎమోషన్ తో వచ్చిన యానిమల్ పాన్ ఇండియా వైడ్ భారీ విజయం సాధించి దాదాపు 800 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ సినిమాతో సందీప్ వంగ మరోసారి బాలీవుడ్ లో తన సత్తా చాటాడు.
ఇప్పుడు సందీప్ వంగ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ప్రభాస్(Prabhas) స్పిరిట్(Spirit) కూడా ఒకటి. త్వరలోనే సందీప్ వంగ ప్రభాస్ స్పిరిట్ సినిమా వర్క్ మొదలు పెట్టనున్నాడు. ప్రభాస్ మారుతీ సినిమా షూట్ అయ్యాక ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి స్పిరిట్ షూటింగ్ మొదలవుతుందని గతంలోనే చెప్పాడు సందీప్ వంగ.
Also Read : Pawan Kalyan : మరోసారి పాటపాడబోతున్న పవన్? ఆ సినిమా కోసం..
తాజాగా సంక్రాతికి సందీప్ భీమవరం వెళ్ళాడు. భీమవరంలో ఎక్కువగా ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారని తెలిసిందే. సంక్రాంతి నాడు అక్కడి ప్రభాస్ ఫ్యాన్స్ సందీప్ కారుని ఆపేశారు. కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ సందీప్ కార్ వద్దకు వచ్చి.. అన్న యానిమల్ సినిమా అదరగొట్టేశావ్. మేమంతా ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్ తో స్పిరిట్ సినిమా బాగా తీయాలన్నా, అదరగొట్టేయాలి. స్పిరిట్ సినిమా అదిరిపోవాలి అన్న, ఆల్ ది బెస్ట్ అన్న అంటూ మాట్లాడారు. సందీప్ ఓకే ఓకే అంటూ థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.