Salaar : ప్రభాస్ ఫ్యాన్స్ పై పోలిసుల లాఠీ ఛార్జ్.. బాహుబలి డేస్ బ్యాక్ అంటున్న రెబల్స్..

ప్రభాస్ ఫ్యాన్స్ పై పోలిసుల లాఠీ ఛార్జ్. బాహుబలి డేస్ బ్యాక్ అంటున్న కొందరు ఫ్యాన్స్. మరికొందరు మాత్రం..

Prabhas fans waiting at theaters to purchase Salaar tickets

Salaar : ప్రభాస్ సలార్ మొదటి భాగం సీజ్ ఫైర్ మరో మూడు రోజుల్లో ఆడియన్స్ ని పలకరించబోతుంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన యాక్షన్ కట్ ట్రైలర్ ఆడియన్స్ లో సినిమా పై భారీ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. దీంతో ఈ మూవీని థియేటర్స్ లో ఎప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యిపోయాయి. తెలంగాణలో మాత్రం టికెట్స్ ని థియేటర్స్ వద్దనే అమ్ముతున్నారు.

దీంతో థియేటర్స్ వద్ద టికెట్స్ కోసం అభిమానులు బారులు తీరారు. ఈక్రమంలోనే కూకట్ పల్లి విశ్వనాధ్ థియేటర్ వద్ద టికెట్స్ కోసం అభిమానులు భారీగా చేరుకున్నారు. అక్కడ కోలాహలం చూస్తుంటే ఈరోజే సినిమా రిలీజ్ లా కనిపిస్తుంది. ఇక థియేటర్ వద్దకి భారీగా అభిమానులు తరలి రావడంతో వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు చేరుకున్నారు. ఈక్రమంలోనే అక్కడి అభిమానులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Also read : Salaar : మహాభారతాన్ని మార్చి సలార్ సినిమాని తెరకెక్కిస్తున్నారా..?

ఇక ఈ వీడియోని బాహుబలి సమయంలో జరిగిన సంఘటనలతో పోలుస్తూ ఒకప్పటి రోజులు మళ్ళీ తిరిగి వచ్చాయంటూ, ప్రభాస్ ఆ గ్లోరీని తీసుకు వచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే టికెట్స్ ని మళ్ళీ ఇలా థియేటర్ వద్దన అమ్మడం పై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలిసుల లాఠీ ఛార్జ్ వీడియో చూపిస్తూ.. “ఇదేనా టికెట్ విండో గ్లోరీ అంటే” అంటూ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ టికెట్ విండో ఆప్షన్ ఎప్పుడు వరకు ఉండబోతుందో, ఆన్ లైన్ లో ఎప్పుడు టికెట్స్ ని వదులుతారో చూడాలి.