Prabhas gives sweet warning to director Hanu Raghavapudi
Prabahs-Hanu: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా క్రేజీ సినిమాలు చేస్తున్నాడు. ప్రెజెంట్ ప్రభాస్ కి ఉన్న మాస్ లైనప్ మరే ఇతర హీరోకి లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 భారీ సినిమాలను సెట్ చేశాడు ప్రభాస్. అందులో దర్శకుడు హను రాఘవాపుడితో చేస్తున్న ఫౌజీ ఒకటి. రెండవ ప్రపంచ యుద్ధం బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికి కారణం ఒకటి ప్రభాస్ కాగా రెండవది సీతారామం లాంటి క్లాసికల్ హిట్ తరువాత దర్శకుడుక హను రాఘవపూడి చేస్తున్న సినిమా కావడం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 2026 డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, ఫౌజీ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే, డైరెక్టర్ హను రాఘవపూడికి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడట. కారణం ఏంటంటే, డైరెక్టర్ హనుకి కోపం చాలా ఎక్కువ. సినిమా మేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారట ఆయన. అందుకే, సెట్ లో అందరిపైనా కోపంగా ప్రదర్శిస్తారట. కొన్నిసార్లు స్టార్స్ హీరో, హీరోయిన్ పైన కూడా అరుస్తాడట హను. ఆయనలో ఈ కోపాన్ని గమనించిన ప్రభాస్ హనుకి హితబోధ చేశాడట. ముందు ఆ కోపాన్ని తగ్గించుకో అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడట. అది కూడా ఆయనకు పాజిటీవ్ వే లోనే. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హను రాఘవపూడి ప్రభాస్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఫౌజీ అనే సినిమా ఆడియన్స్ కి చాలా కొత్త అనుభూతిని అందిస్తుంది. మీరు ఎన్ని అంచనాలు పెట్టుకొని వచ్చినా ఆ అంచనాలను అందుకునేలానే ఉంది ఈ సినిమా. నా దగ్గర ఆర్మీ బ్యాక్డ్రాప్ లో దాదాపు 6 కథలు ఉన్నాయి. కానీ, ఫౌజీ మాత్రం ప్రభాస్ కోసం రాసిన కథ. సీతారామం తరువాత ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లు కష్టపడ్డాను. ప్రభాస్ కూడా ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తారు అంటూ చెప్పుకొచ్చాడు హను. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.