Prabhas Hanu
Prabhas Hanu : ప్రభాస్ త్వరలో రాజాసాబ్ సినిమాతో రాబోతున్నాడు. అనంతరం హను రాఘవపూడి సినిమాతో రానున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ పెట్టారని రూమర్స్ ఉన్నాయి. ఆర్మీ, యుద్ధం బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి ప్రేమకథతో ఈ సినిమా కథ ఉందనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో కొత్త అమ్మాయి ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది.(Prabhas Hanu)
రేపు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా నుంచి తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేసి అప్డేట్ ఇచ్చారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ కాళ్ళు మాత్రమే చూపిస్తూ.. సింగిల్ గా నడిచే సైనిక దళం అనే అర్ధం వచ్చేలా ఇంగ్లీష్ లో ఓ కొటేషన్ ఇచ్చారు. అలాగే 1932 నుంచి మోస్ట్ వాంటెడ్ అని పోస్టర్ మీద ఉంది. అలాగే పోస్టర్ పై సైనికులు యుద్ధం చేస్తున్నట్టు, హిందీలో కొన్ని మాటలు కూడా రాసి ఉన్నాయి. దీంతో ఇందులో యుద్ధం బ్యాక్ డ్రాప్ తో పాటు స్పై కథాంశం కూడా ఉందా? ప్రభాస్ స్పై పాత్రలో నటిస్తున్నాడా అని ఆసక్తి నెలకొంది.
Also Read : Rajesh Danda : నాకు కోపం రాదా.. నా యుద్ధం మీడియా మీద కాదు ఆ ముసుగులో సినిమాలను చంపేస్తున్న వాళ్ళ మీద..
ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రభాస్ హను సినిమా టైటిల్ రేపు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23న ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మరి ఫౌజీ అనే టైటిల్ ప్రకటిస్తారా లేకా ఇంకేదైనా కొత్త టైటిల్ ప్రకటిస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
———————————-
पाण्डवपक्षे संस्थित कर्णः।
———————————-#PrabhasHanu TITLE POSTER – Tomorrow @ 11.07 AM ❤🔥Rebel Star #Prabhas #Imanvi @hanurpudi #MithunChakraborty #JayaPrada @AnupamPKher @Composer_Vishal @sudeepdop @kk_lyricist… pic.twitter.com/jf8hYx9usU
— Mythri Movie Makers (@MythriOfficial) October 22, 2025