Rajesh Danda : నాకు కోపం రాదా.. నా యుద్ధం మీడియా మీద కాదు ఆ ముసుగులో సినిమాలను చంపేస్తున్న వాళ్ళ మీద..

తాజాగా మరోసారి దీనిపై వివరణ ఇస్తూ రాజేష్ దండా ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసారు. (Rajesh Danda)

Rajesh Danda : నాకు కోపం రాదా.. నా యుద్ధం మీడియా మీద కాదు ఆ ముసుగులో సినిమాలను చంపేస్తున్న వాళ్ళ మీద..

Rajesh Danda

Updated On : October 22, 2025 / 11:15 AM IST

Rajesh Danda : ఇటీవల పలువురు నిర్మాతలు కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ పనికట్టుకొని తమ సినిమాలపై నెగిటివిటి చేస్తున్నారని మాట్లాడుతున్నారు. దానికి తగ్గట్టే ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా వ్యవహరిస్తున్నాయి. మొన్న బన్నీవాసు, నిన్న రాజేష్ దండా ఇద్దరు నిర్మాతలు దీపావళికి వచ్చిన తమ సినిమాలను చంపేస్తున్నారని వాపోయారు.(Rajesh Danda)

కిరణ్ అబ్బవరం హీరోగా రాజేష్ దండా నిర్మాణంలో వచ్చిన K ర్యాంప్ సినిమా మంచి విజయం సాధించింది. కానీ ఓ వెబ్ సైట్, దానికి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆ సినిమాపై నెగిటివ్ రివ్యూలు, ఆర్టికల్స్ రాయడం, తక్కువ రేటింగ్స్ వేయడం చేసాయి. దీంతో K ర్యాంప్ సక్సెస్ మీట్ లో నిర్మాత రాజేష్ దండా ఆ వెబ్ సైట్ పై, ట్విట్టర్ అకౌంట్స్ పై ఫైర్ అయ్యారు.

Also See : Jabardasth Kevvu Kartheek : భార్యతో కలిసి జబర్దస్త్ కెవ్వు కార్తీక్ దీపావళి సెలబ్రేషన్స్.. ఫొటోలు చూశారా?

Rajesh Danda

తాజాగా మరోసారి దీనిపై వివరణ ఇస్తూ రాజేష్ దండా ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ లో రాజేష్ దండా.. మీడియా మిత్రులకు, మీడియా సంస్థలకు విన్నపం. నిర్మాతగా, పంపిణీ దారుగా రాజేష్ దండా మీడియాతో ఎలాంటి గౌరవ మర్యాదలతో ఉంటాడు అనేది మీడియా మిత్రులు అందరికీ తెలుసు. అలాంటి నేను నిన్న ఎందుకు ఓ వెబ్ సైట్ పట్ల, ఆ వెబ్ సైట్ నిర్వాహకుల పట్ల, పరుషంగా మాట్లాడాల్సి వచ్చింది. కోట్లు ఖర్చు పెట్టి నిర్మాతగా ఓ సినిమా తీసాను. ఆ వెబ్ సైట్ దానిని సమీక్షించి, దానికో రేటింగ్ ఇచ్చింది.

అంత వరకు నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ సినిమాను జనం ఆదరిస్తున్నారు. ఆ విధంగా సినిమా హిట్ అయితే ఆ సైట్ సమీక్షల క్రెడిబులిటీ పోతుంది కాబట్టి వాళ్ల రేటింగ్ ను నిలబెట్టుకోవాలని నా సినిమా మీద నెగిటివ్ పోస్ట్ లు, నెగిటివ్ వార్తలు వేయడం ప్రారంభించారు. గతంలో మ్యాడ్ 2 సినిమా విషయంలో ఇంకో వెబ్ సైట్ ఇలాగే చేస్తే, నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించారు. అప్పుడు కూడా ఆయన చెప్పారు. మా మీద ఆధారపడి వెబ్ సైట్ లు నడుపుతూ ఇలా చేయడం తప్పు అని చెప్పారు.

Also Read : Trivikram Balakrishna : బాలకృష్ణ – త్రివిక్రమ్ సినిమా జస్ట్ మిస్.. ఆ సినిమా వచ్చి ఉంటే మాస్ హీరోతో క్లాస్ డైలాగ్స్ ఎలా ఉండేవో..

ఇప్పుడు నేనూ అదే చెబుతున్నాను. అయితే నేను వాడిన భాష అభ్యంతరకరం అని అంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసిన నా సినిమాను చంపేస్తూ, నాకు కోట్ల నష్టం కలిగించే ప్రయత్నం చేస్తుంటే కోపం రాదా.. నేనూ మనిషినే కదా. అందుకే అలా మాట్లాడాను. అంతకు మించి మరే మీడియా సంస్థ మీద, మరే మీడియా వ్యక్తి మీద నాకు ఏ కోపం లేదు. పైగా 150 మందికి పైగా వున్న సినిమా జర్నలిస్ట్ లు, సోషల్ మీడియా జనాలు, మీమర్స్ అందరూ నాకు అత్యంత సన్నిహితులే. వారంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. నా బాధ, కోపంలో వచ్చిన భాషను సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నా యుద్దం మీడియా మీద కాదు.. మీడియా ముసుగు లో సినిమా లను చంపుతున్న ఆ వెబ్ సైట్ మీద అని పోస్ట్ చేసారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.