Prabhas : ప్రభాస్ ఆ పాట మొత్తం పాడేవాడట.. ఆర్జీవీ తీసిన ఆ సినిమా ప్రభాస్ కి ఇష్టమంట..

ఇంటర్వ్యూలో సిరివెన్నెల గారు రాసిన సాంగ్స్, అందులో సాహిత్యం గురించి కూడా చాలా బాగా మాట్లాడాడు ప్రభాస్.

Prabhas Interesting Comments on RGV Movie and Sirivennela Seetharama Sastry Songs

Prabhas : ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఫుల్ బిజీగా ఉన్నాడు. సలార్, కల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి ఇప్పుడు రాజాసాబ్, హను రాఘవపూడి సినిమా, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో ఇంకొన్ని ప్రాజెక్ట్స్ కూడా అనౌన్స్ చేస్తారని వినిపిస్తుంది. అయితే ఇటీవల ప్రభాస్ ఓ ఇంటర్వ్యూకు వచ్చారు.

ఎన్నో అద్భుతమైన వేల పాటలను మనకు అందించిన దివంగత పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిని స్మరిస్తూ ఈటీవి ఛానల్ నా ఉఛ్వాసం కవనం అనే ఓ ఇంటర్వ్యూ సిరీస్ చేస్తుంది. ఈ ఇంటర్వ్యూకి ప్రభాస్ రాగా ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు నాడు మొదటి పార్ట్ విడుదల చేసారు. తాజాగా నేడు రెండో పార్ట్ విడుదల చేసారు. ఈ ఇంటర్వ్యూ ఈటీవి విన్ యాప్ లో రిలీజ్ చేసారు.

Also Read : Narne Nithiin – NTR : నిశ్చితార్థం చేసుకున్న హీరో.. బామ్మర్ది నిశ్చితార్థానికి ఫ్యామిలీతో వచ్చిన ఎన్టీఆర్.. వీడియో వైరల్..

ఈ ఇంటర్వ్యూలో సిరివెన్నెల గారు రాసిన సాంగ్స్, అందులో సాహిత్యం గురించి కూడా చాలా బాగా మాట్లాడాడు ప్రభాస్. ఈ క్రమంలో ప్రభాస్ మాట్లాడుతూ.. సిరివెన్నెల లాంటి సాంగ్స్ రాసిన ఆయన బోటనీ పాఠముంది లాంటి సాంగ్స్ కు షిఫ్ట్ అయి కూడా చాలా బాగా రాసారు. ఆ పాట రాసింది శాస్త్రి గారే అని తెలిసినప్పుడు నేను షాక్ అయ్యాను. సిరివెన్నెల లాంటి సాంగ్స్ రాసిన ఆయన ఇలాంటి సాంగ్స్ ఎలా రాసారు అనుకునేవాడిని. బోటనీ పాఠముంది సాంగ్ నాకు మొత్తం వచ్చు. ఆ పాట ఫుల్ గా పాడేవాడ్ని. శివ సినిమా కూడా చాలా ఇష్టం. ఆ సినిమా కూడా కొత్తగా ఉంటుంది అని అన్నారు.

ఆర్జీవీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన శివ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. అప్పట్లో టాలీవుడ్ లో అదొక ట్రెండ్ సెట్టర్ సినిమాలా నిలిచింది.