Prabhas Kalki 2 movie shooting will begin from February.
Kalki 2: ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సీక్వెల్ ఏదైనా ఉందంటే అది కల్కి 2 అనే చెప్పాలి. ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా ఆ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మరి. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. డివోషనల్ కాన్సెప్ట్ కి ఫ్యూచరిస్టిక్ కంటెంట్ ను యాడ్ చేసి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్.
దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్స్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుంది అని చెప్పారు మేకర్స్. కానీ, కల్కి సినిమా విడుదలై ఏడాది గడుస్తున్నా సీక్వెల్ పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ నేపధ్యంలోనే తాజాగా కల్కి సీక్వెల్(Kalki 2) గురించి ఒక న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
Dhanush- Mrunal: ఫిబ్రవరి 14న ధనుష్- మృణాల్ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన మృణాల్ టీం
అదేంటంటే, కల్కి సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలుకానుందట. దాదాపు ఆరు నెలల నుంచి ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులే జరుగుతూ వస్తున్నాయట. ఈ సినిమాలో కూడా భారీ గ్రాఫిక్స్, భారీ సెట్టింగ్ లు ఉండనున్నాయట. అందుకే ఇంతకాలం పాటు ప్రీ ప్రొడక్షన్ నిర్వహించారట. ఆ పనులు కంప్లీట్ అవడంతో ఫిబ్రవరి నుంచి అసలు కథను మొదలుపెట్టనున్నారట.
ప్రస్తుతం ప్రభాస్ ఓపక్క స్పిరిట్, మరోపక్క ఫౌజీ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. వాటిని కంటిన్యూ చేస్తూనే ఇప్పుడు కల్కి సీక్వెల్ షూటింగ్ ని కూడా మొదలుపెట్టనున్నాడట. దీంతో, ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కల్కి సీక్వెల్ 2028లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే, దీపికా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో ఎవరిని తీసుకుంటారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.