Dhanush- Mrunal: ఫిబ్రవరి 14న ధనుష్- మృణాల్ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన మృణాల్ టీం
హీరో ధనుష్- మృణాల్ ఠాకూర్(Dhanush- Mrunal) పెళ్లిపై వస్తున్న వార్తలపై మృణాల్ టీం స్పందించింది.
Danush and mrinal takur marriage
- ధనుష్- మృణాల్ పెళ్లి
- ఫిబ్రవరి 14న ముహూర్తం
- స్పందించిన మృణాల్ టీమ్
Dhanush- Mrunal: ధనుష్- మృణాల్ ఠాకూర్.. ఈ రెండు పేర్లు గత వారం రోజుల నుంచి తెగ వైరల్ అవుతున్నాయి. కారణం ఏంటంటే, త్వరలో ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారట. ఈ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. హిందీ, తమిళ, తెలుగు అన్ని సోషల్ మీడియాల్లో ఇదే వార్త. అంతేకాదు, ఈ మధ్య కాలంలో రెండు, మూడు సార్లు ఈ ఇద్దరు కలిసి కూడా కనిపించారు. దీంతో, ఆ వార్తలకు ఇంకా బలం చేకూరింది.
Rashi Khanna: ఎద అందాలతో మతిపోగొడుతున్న రాశి ఖన్నా.. ఫొటోలు
అయితే, వారం రోజుల నుంచి ఈ వార్త ఇంతలా వైరల్ అవుతూ ఉన్నా అటు ధనుష్ కానీ, ఇటు మృణాల్(Dhanush- Mrunal) కానీ ఎవరు ఖండించలేదు. అలాగని అవునని కూడా చెప్పలేదు. దాంతో, ఈ వార్తలు నిజమే అంటూ జనాలు ఫిక్స్ అయ్యారు. గత రెండు రోజుల నుంచి వీరు పెళ్లి చేసుకోబోయే డేట్ ఫిబ్రవరి 14 అంటూ మరో వార్త వైరల్ అయ్యింది. ఈ వార్తలు మృణాల్ వరకు చేరడంతో తాజాగా ఈ పెళ్లి వార్తలపై మృణాల్ టీం స్పందించింది.
ధనుష్- మృణాల్ పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఫిబ్రవరి 14న ధనుష్-మృణాల్ పెళ్లి చేసుకోవడం లేదు. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా వస్తున్న ఈ వార్తలను ప్రేక్షకులు నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. దీంతో మృణాల్- ధనుష్ ల పెళ్లిపై వస్తున్న రూమర్స్ కి చెక్ పడింది.
