Prabhas Kalki 2898 AD movie team set timer for release date announcement
Kalki 2898 AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో హిందూ మైథలాజి కథతో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి 2898AD’. ఈ సినిమాలో కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సంక్రాంతి పండక్కే రావాల్సిన ఈ చిత్రం.. షూటింగ్, గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం అవ్వడంతో వాయిదా పడింది. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉందని సమాచారం.
దీంతో సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఆ విడుదల తేదీని సంక్రాంతి కానుకగా అభిమానులకు తెలియజేయబోతున్నారు. ఇక ఈ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ని కూడా మూవీ టీం కొత్తగా ప్రమోట్ చేస్తుంది. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌కి ఓ టైమర్ ఫిక్స్ చేసింది. ఈ మూవీ టైటిల్ లో 2898AD అనే టైం లైన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ టైం లైన్‌కే టైమర్ సెట్ చేశారు.
2024 జనవరి 9వ తారీఖు నుంచి ఈ టైమర్ మొదలైంది. ఆ టైమర్ 2898 ఇయర్ ని ఎప్పుడు చేరుకుంటుందో అప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ అంటూ తెలియజేశారు. కాగా ఈ టైమర్ ఇప్పటికి 2057వ సంవత్సరానికి చేరుకుంది. ఇక ఈ టైమర్ ఎప్పుడు 2898ని చేరుకుంటుందో అని అభిమానులంతా.. ఒక పక్క టైమర్ ని పెట్టుకొని గమనిస్తూ వస్తున్నారు. కాగా ఈ రిలీజ్ డేట్ పై ఒక వార్త ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
It Begins!#Kalki2898AD https://t.co/gIN9tyTH29
— Kalki 2898 AD (@Kalki2898AD) January 9, 2024
కల్కి సినిమాని వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ నుంచి వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి, మహర్షి లాంటి సూపర్ హిట్ సినిమాలు మే 9న రిలీజ్ అయ్యి.. ఆ బ్యానర్ లోనే కాదు తెలుగు ఇండస్ట్రీలో కూడా గుర్తుండిపోయే చిత్రాలుగా నిలిచాయి. ఆ డేట్ వైజయంతి మూవీస్ కి బాగా కలిసి రావడంతో కల్కి లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుని కూడా ఆ డేట్ లోనే రిలీజ్ చేయాలని భావించినట్లు సమాచారం.