Kalki 2898AD : ప్రభాస్ ‘కల్కి’ మళ్ళీ వాయిదానా? సమ్మర్ కి లేనట్టేనా?

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అయితే హాలీవుడ్ సినిమాలని మించి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

Prabhas Kalki 2898AD Movie will Postpone again from Summer

Kalki 2898AD Movie : మన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ఇటీవలే సలార్(Salaar) సినిమాతో వచ్చి థియేటర్స్ లో సందడి చేశాడు. ఇప్పటికే కల్కి సినిమా 650 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రభాస్ చాలా రోజుల తర్వాత సలార్ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ప్రభాస్ లైనప్ మరింత పెద్దగానే ఉంది. కల్కి 2898AD, ప్రభాస్ మారుతీ సినిమా, స్పిరిట్, సలార్ 2.. ఇలా ప్రభాస్ వరుస సినిమాలని లైన్లో పెట్టాడు.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అయితే హాలీవుడ్ సినిమాలని మించి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో కల్కి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కల్కి సినిమాని ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేశారు. 2024 సమ్మర్ కి ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ ఇప్పుడు అది కూడా కష్టమే అని తెలుస్తుంది.

సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు. ప్రభాస్, కమల్ హాసన్ లపై తెరకెక్కించాల్సిన సన్నివేశాలు, మరిన్ని సీన్స్ ఉన్నాయని సమాచారం. అలాగే ఈ సినిమాకు గ్రాఫిక్స్ భాగం చాలా ఎక్కువ ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ కి కనీసం 6 నెలలు పట్టొచ్చు అని టాక్. దీంతో కల్కి సినిమా ఈ సమ్మర్ నుంచి వాయిదా పడటం కాదు అసలు ఈ సంవత్సరం వస్తుందా అని సందేహిస్తున్నారు ప్రభాస్ అభిమానులు. మరి ప్రభాస్ ని కల్కిగా చూడాలంటే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయక తప్పదేమో.

Also Read : Thandel : ఊరించి ఊరించి ఉసూరుమనిపించిన ‘తండేల్’.. గ్లింప్స్ రిలీజ్ వాయిదా..

ఇక కల్కి సినిమాలో దీపికా పదుకోన్, అమితాబ్, దిశా పటాని, కమల్ హాసన్.. ఇలా పలువురు స్టార్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న దీపికా పదుకోన్ పుట్టిన రోజు కావడంతో ఆమెకు విషెష్ చెప్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్.