Thandel : ఊరించి ఊరించి ఉసూరుమనిపించిన ‘తండేల్’.. గ్లింప్స్ రిలీజ్ వాయిదా..

నాగచైతన్య, సాయి పల్లవి 'తండేల్' గ్లింప్స్ రిలీజ్ అయ్యింది.

Thandel : ఊరించి ఊరించి ఉసూరుమనిపించిన ‘తండేల్’.. గ్లింప్స్ రిలీజ్ వాయిదా..

Naga Chaitanya Sai Pallavi Thandel movie glimpse teaser release postpone

Updated On : January 5, 2024 / 9:01 PM IST

Thandel : టాలీవుడ్ యువ సామ్రాట్ నాగచైతన్య, చందూ మొండేటి దర్శకత్వంలో తన 23వ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. గీతాఆర్ట్స్ లో బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే నాగచైతన్య ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా అదిరే రెస్పాన్స్ వచ్చింది. ఇక నేడు జనవరి 5న ఈ మూవీ గ్లింప్స్ ని రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు.

ఈరోజు సాయంత్రం గం.5కి రిలీజ్ చేస్తామని చెప్పి, దానిని 7 గంటలకి పోస్టుపోన్ చేశారు. కానీ ఆ సమయానికి కూడా రిలీజ్ చేయలేకపోయారు. కొన్ని టెక్నికల్ సమస్యలు ఎదురవ్వడంతో ఈ గ్లింప్స్ రిలీజ్ ని పోస్టుపోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ గ్లింప్స్ ని రేపు జనవరి 6న ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తామంటూ ప్రకటించారు. అయితే సరైన టైం చెప్పలేదు. మరి రేపు ఏ సమయంలో రిలీజ్ చేస్తారో చూడాలి.

Also read : Prabhas : బాబోయ్.. మన ప్రభాసా ఇలా విష్ చేసింది.. మోస్ట్ బ్యూటిఫుల్ అంటూ పోస్ట్..

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 2018లో గుజరాత్ నుండి 21 మంది మత్స్యకారులు వేటకెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ కోస్ట్ గార్డ్‌ చెరలో చిక్కుకోగా అందులో ఉన్న ఓ ఆంద్ర మత్స్యకారుడు కథ ఆధారంగా తెరకెక్కబోతున్నట్టు మేకర్స్ తెలియజేశారు. యాక్షన్ థ్రిల్లర్ స్క్రీన్ ప్లేతో ఒక ప్యూర్ లవ్ స్టోరీని ఈ సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమాలో నాగ్ చైతన్య సిక్స్ ప్యాక్ కూడా చూపించబోతున్నట్టు తెలుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రాన్ని సంగీతం అందిస్తున్నారు.