Prabhas Kalki 2898ADMovie gets Very Low TRP Rating on first Telecast
Kalki 2898 AD : నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కిన కల్కి 2898AD సినిమా గత సంవత్సరం జూన్ 27న రిలీజయి భారీ హిట్ కొట్టింది. మహాభారతానికి, భవిష్యత్తుకు లింక్ ఇస్తూ సైంటిఫిక్ మైథలాజికల్ సినిమాగా కల్కి తెరకెక్కింది. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సినిమా అందర్నీ ఆశ్చర్యపరిచి మెప్పించింది. అమితాబ్, దీపిక పదుకోన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రలతో చాలా మంది స్టార్స్, డైరెక్టర్స్ గెస్ట్ రోల్స్ తో ఈ సినిమా అందర్నీ ఆకట్టుకొని పెద్ద విజయం సాధించింది.
కల్కి సినిమాకు ఆల్మోస్ట్ 1200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కల్కి 2 సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. 2025 చివర్లో షూటింగ్ మొదలుపెడతారని సమాచారం. అయితే ఈ సినిమా ఇటీవల సంక్రాంతికి టీవీలో టెలికాస్ట్ అయింది. సాధారణంగా ఐలాంటి పెద్ద సినిమాలు టీవీ లో వస్తే భారీ టీఆర్పీ రేటింగ్ సాధిస్తాయి. కానీ కల్కి 2898AD సినిమాకు వచ్చిన టీఆర్పీ రేటింగ్ అందరిని షాక్ కి గురిచేసింది.
Also Read : Pushpa 2 Collections : పుష్ప 2 కలెక్షన్స్ 1300 కోట్లా? 2300 కోట్లా? 1800 కోట్లా? నిజం చెప్పండయ్యా..
ఇటీవల సంక్రాంతికి జనవరి 12 సాయంత్రం 5.30 గంటలకు కల్కి సినిమా జీ తెలుగు ఛానల్ లో మొదటిసారి వేశారు. ఈ సినిమాకు కేవలం 5.26 టీఆర్పీ రేటింగ్ రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.ప్రభాస్ సినిమాకు, అందులోను సూపర్ హిట్ సినిమాకు ఇంత తక్కువ టీఆర్పీ రేటింగ్ రావడం షాకింగ్ విషయమే. దీనిపై ప్రభాస్ అభిమానులు కూడా నివ్వెరపోతున్నారు. దీని కంటే ప్రభాస్ ఫ్లాప్ సినిమా రాధేశ్యామ్ కి కూడా ఎక్కువ వచ్చింది కదా అని షాక్ అవుతున్నారు. సాధారణంగా పండగల సమయంలో పెద్ద సినిమాలు వేస్తే మంచి రేటింగ్స్ వస్తాయి. కానీ కల్కి సినిమాకి ఇంత తక్కువ రేటింగ్ రావడం ఏంటో అర్ధం కావట్లేదు.
అయితే ఈ రేటింగ్ ని చూసి మిగిలిన హీరోల ఫ్యాన్స్ మా హీరోకు రేటింగ్ ఎక్కువ వచ్చిందని హడావిడి మొదలుపెట్టారు. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాకు 29.4 రేటింగ్ వచ్చింది. ఇప్పటివరకు తెలుగు సినిమాలకు అదే హైయెస్ట్. మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాకు కూడా ఆల్మోస్ట్ 23.4 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. గుంటూరు కారం సినిమాకు, తేజ సజ్జ హనుమాన్ సినిమాలకు కూడా 9 పైనే రేటింగ్ వచ్చింది. అలాంటిది కల్కి సినిమాకు ఇంత తక్కువ రావడమేంటో..
Also See : నాగచైతన్య – సాయి పల్లవి ‘తండేల్’ సినిమా రెండో పాట విన్నారా?
అయితే ప్రభాస్ గత కొన్నాళ్ల నుంచి అన్నీ యాక్షన్ సినిమాలే చేస్తున్నాడు, ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరమయ్యాడు అందుకే టీఆర్పీ రేటింగ్ తగ్గింది అని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ప్రభాస్ ఇప్పుడున్న పొజిషన్ కి అసలు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం సినిమా చేయగలడా చూడాలి మరి. ఏది ఏమైనా కల్కి లాంటి బిగ్గెస్ట్ హిట్ సినిమా టీవీలో ఫ్లాప్ రేటింగ్ తెచ్చుకువడం టాలీవుడ్ లో, ఫ్యాన్స్ లో చర్చగా మారింది.