Prabhas Kalki Ad 2898 Pre Release Event In Amaravati
Prabhas Kalki AD 2898 : ప్రభాస్ నటిస్తున్న మూవీ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, గ్లింప్స్, బుజ్జి వెహికల్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. జూన్ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషనల్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున్న నిర్వహిస్తోంది చిత్రబృందం.
ఈ చిత్రంలో స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జి అనే కారును దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో తిప్పుతూ సినిమాపై బజ్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా ఫ్లాన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఈవెంట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించనున్నట్లు టాక్.
Abhirami : చెప్పవే చిరుగాలి ఫేమ్ ‘అభిరామి’ని గుర్తుపట్టారా..? ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి..
ఈ వేడుకకు టీడీపీ అధినేత, కాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఈవెంట్‌కు తీసుకువచ్చే పనిలో మూవీ ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 23న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు అనే ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే.. దీనిపై ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు
కల్కి 2898AD చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ దాదాపు 400కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని వంటి నటీనటులు కీలక పాత్రలను పోషించారు.
Sudheer Babu : కుప్పంలో సినిమా తీసి.. చంద్రబాబును కలిసిన సుధీర్ బాబు..