Abhirami : చెప్పవే చిరుగాలి ఫేమ్ ‘అభిరామి’ని గుర్తుపట్టారా..? ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి..
కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న అభిరామి ఇటీవల అడపాదడపా సినిమాలు చేస్తుంది.

Cheppave Chirugali Fame Actress Abhirami coming in Telugu after a Long Gap Recent Photos goes Viral
Abhirami : మలయాళీ భామ అభిరామి మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ్ భాషల్లో హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. తెలుగులో వేణుతో కలిసి చెప్పవే చిరుగాలి లాంటి సూపర్ హిట్ మూవీలో నటించింది. దాంతో పాటు తెలుగులో మరో రెండు సినిమాలు చేసింది. చెప్పవే చిరుగాలి సినిమాతో మాత్రం మంచి పేరు తెచ్చుకుంది. అయితే పెళ్లి తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న అభిరామి ఇటీవల అడపాదడపా సినిమాలు చేస్తుంది.
కొన్నాళ్ల క్రితం రవితేజ అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో కూడా చిన్న పాత్ర చేసింది. ఇటీవలే కొన్ని రోజుల క్రితం రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న భలే ఉన్నాడే సినిమాలో నటిస్తుందని ప్రకటించారు. దానికంటే ముందే ఓ తమిళ్ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అభిరామి. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తన 50వ సినిమాగా తెరకెక్కిన మహారాజా సినిమా జూన్ 14 రాబోతుంది. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేస్తుండటంతో ఇక్కడ హైదరాబాద్ లో ప్రెస్ మెట్ నిర్వహించారు మూవీ యూనిట్.
మహారాజ సినిమా ఈవెంట్ కి అభిరామి కూడా హాజరైంది. దాదాపు 20 ఏళ్ళ తర్వాత తెలుగు ప్రెస్ మీట్స్ లో అభిరామి కనిపించింది. అభిరామి చాలా రోజుల తర్వాత కనపడింది అంటూ ఆశ్చర్యపోతూనే చాలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అభిరామి మళ్ళీ తెలుగులో వరుసగా రాబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేసింది.