Adipurush : రాముడి ఆగమనం.. ఆదిపురుష్ ప్రీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి..

ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ ని బిగ్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ బుకింగ్స్ ని ఓపెన్ చేశారు.

Prabhas Kriti Sanon Adipurush pre bookings open in India wide

Prabhas Adipurush : ప్రభాస్ రాముడిగా రామాయణం కథాంశంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న సినిమా ఆదిపురుష్. కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో టి సిరీస్, రెట్రోఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ట్రైలర్స్ భారీ హైప్ ని క్రియేట్ చేశాయి. దీంతో ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఎదురు చూస్తున్నారు అభిమానులంతా.

Yash : సీనియర్ నటి సుమలత కొడుకు పెళ్లిలో హీరో యశ్ సందడి.. డాన్స్ వీడియో వైరల్!

తాజాగా 5 రోజులు ముందే ఈ మూవీ ప్రీ బుకింగ్స్ ని ఓపెన్ చేశారు. బుక్ మై షో (Book my show) అండ్ పేటిఎమ్ (paytm) ల్లో ఈ మూవీ ప్రీ బుకింగ్స్ ని ఓపెన్ చేశారు. ఇప్పటికే బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యిపోయాయి. రాముడి ఆగమనాన్ని మొదటి రోజే చూడాలని ప్రభాస్ అభిమానులు తెగ ఉత్సాహపడుతున్నారు. కాగా అమెరికాలో ఈ మూవీ బుకింగ్స్ ని 20 రోజులు క్రిందటే ఓపెన్ చేశారు. మరి పాన్ ఇండియా వైడ్ క్రేజ్ ఉన్న ఈ చిత్రం ఏ రేంజ్ ఓపెనింగ్స్ అందుకుంటుందో చూడాలి.

Bandla Ganesh : బాలయ్యతో కాదు పవన్‌తో సినిమా తీయడం నా డ్రీమ్.. నాగవంశీకి బండ్ల గణేష్ ట్వీట్!

కాగా ఈ సినిమా కలెక్షన్స్ కి అమెరికాలో కొంచెం ఇబ్బంది వాతావరణం నెలకుంది. ఆదిపురుష్ రిలీజ్ రోజునే హాలీవుడ్ యాంటిసిపేటెడ్ మూవీ ఫ్లాష్ (Flash) రిలీజ్ కూడా ఉంది. దీంతో US బాక్స్ ఆఫీస్ వద్ద ఆదిపురుష్, ఫ్లాష్ తో పోటీ పడాల్సి వస్తుంది. ఇక ఇండియాలో ఆదిపురుష్ ని IMAX థియేటర్స్ లో రిలీజ్ చేయడం లేదు. దీంతో ఇక్కడ కూడా IMAX థియేటర్స్ ని ఫ్లాష్ మూవీ దక్కించుకుంది. ఆదిపురుష్ ని IMAX థియేటర్స్ లో చూదామనుకున్న ప్రభాస్ అభిమానులు కొంత నిరాశ చెందుతున్నారు.