Prabhas : శివ ధనుస్సుని ఎత్తిన ప్రభాస్.. గ్రౌండ్ అంతా దద్దరిల్లిపోయిందిగా..

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎవరూ ఊహించనంత గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ లో ఎన్నో అద్భుతమైన దృశ్యాలు ఆవిష్కరమయ్యాయి.

Prabhas : శివ ధనుస్సుని ఎత్తిన ప్రభాస్.. గ్రౌండ్ అంతా దద్దరిల్లిపోయిందిగా..

Prabhas lifted Shiva Dhanush in Adipurush Pre Release Event

Updated On : June 7, 2023 / 7:30 AM IST

Adipurush : ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక నిన్న జూన్ 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతి (Tirupati) శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో భారీగా నిర్వహించారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. దాదాపు లక్ష మందికి పైగా అభిమానులు,ప్రేక్షకులు ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎవరూ ఊహించనంత గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ లో ఎన్నో అద్భుతమైన దృశ్యాలు ఆవిష్కరమయ్యాయి.

Chinna Jeeyar Swami : నిజమైన బాహుబలి రాముడు.. మాలాంటి వాళ్ళు సినిమా ఈవెంట్స్‌కి రారు.. కానీ ఆదిపురుష్..

అలాంటి అద్భుతమైన దృశ్యాలలో ప్రభాస్ శివధనస్సుని ఎత్తడం ఒకటి. ఈవెంట్ లో భాగంగా శివధనస్సుని ఎత్తే సీన్ ని రీ క్రియేట్ చేయించారు. ప్రభాస్ స్టేజి మీదకు రాగా ఒక టేబుల్ పై శివ ధనుస్సుని ఉంచారు. ప్రభాస్ ఆ శివ ధనసుని పైకి లేపారు. దాన్ని పైకి పెట్టి ఎక్కుపెట్టారు. దీంతో ఒక్కసారిగా గ్రౌండ్ లో ఉన్న ఫ్యాన్స్, ప్రేక్షకుల కేరింతలతో సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది. అదే సమయంలో సభా ప్రాంగణం వద్ద క్రాకర్స్ కూడా పేల్చారు. ఇక ప్రభాస్ శివ ధనుస్సుని పైకి లేపిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.