Baahubali 3
Baahubali 3 : బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్.. రెండు పార్టులుగా వచ్చిన ఈ మూవీ తెలుగు సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌ను చేసింది. ప్రభాస్, అనుష్క, రానా దగ్గుబాటి, తమన్నా వంటి స్టార్ కాస్ట్‌తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది బాహుబలి. ఇటీవలే ఈ సినిమా పదేళ్ల సంబరాలు కూడా చేసుకున్నారు.
త్వరలో బాహుబలి 1, 2 రెండు సినిమాలను కలిపి ఒకే మూవీగా రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇది అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. అయితే సినీ లవర్స్‌ను ఆశ్చర్యపరిచే మరో వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. బాహుబలి-3 స్క్రిప్ట్ వర్క్ జోరుగా సాగుతోందని, ఈ రీ-రిలీజ్ సమయంలోనే పార్ట్-3పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : Raviteja : తండ్రి చనిపోయిన రెండు రోజులకే షూటింగ్ లో రవితేజ.. మాస్ మహారాజ సినిమా డెడికేషన్..
బాహుబలి-3లో ఓ ట్విస్ట్ ఉంటుందని టాక్. పార్ట్-1, పార్ట్-2లో కీలక పాత్రల్లో నటించిన ప్రభాస్, అనుష్క పార్ట్-3లో మెయిన్ లీడ్ లో నటించకపోవచ్చని అంటున్నారు. బాహుబలి-3లో ప్రభాస్ చిన్న కామియో రోల్‌లో మాత్రమే కనిపించనున్నాడట. ఇక మెయిన్ క్యారెక్టర్‌గా బాలీవుడ్‌లో ఉదయిస్తున్న ఒక యంగ్ హీరోని తీసుకునే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ యంగ్ హీరో ఎవరన్నది ఇంకా సీక్రెట్‌గానే ఉంది. కానీ ఈ కాస్టింగ్ నిర్ణయం సినిమాకి కొత్త ఊపు తీసుకొస్తుందని అంటున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే ఈ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి-3 కూడా మాహిష్మతి సామ్రాజ్యంతోనే కొనసాగుతుందా లేక కొత్త కథాంశంతో వస్తుందా అన్నది ఇంకా సస్పెన్స్‌గా ఉంది. రీ-రిలీజ్ సమయంలో ప్రకటన వస్తే, అది కచ్చితంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసే అప్‌డేట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. మరి బాహుబలి-3లో హీరోగా ఎవరు కనిపిస్తారు? అసలు బాహుబలి-3పై అధికారిక ప్రకటన వస్తుందా లేదా అనేది అక్టోబర్ వరకు వేచిచూడాలి.
Also Read : Fahadh Faasil : ఇంకా కీప్యాడ్ ఫోన్ వాడుతున్న పుష్ప విలన్.. కానీ ఫోన్ ధర మాత్రం లక్షల్లో..