Raviteja : తండ్రి చనిపోయిన రెండు రోజులకే షూటింగ్ లో రవితేజ.. మాస్ మహారాజ సినిమా డెడికేషన్..
రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు ఇటీవల నాలుగు రోజల క్రితం మరణించిన సంగతి తెలిసిందే.

Raviteja
Raviteja : మాస్ మహారాజ రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు ఇటీవల నాలుగు రోజల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. చిరంజీవితో సహా పలువురు సినీప్రముఖులు కూడా ఆయనకు నివాళులు అర్పించారు. అయితే తండ్రి మరణించి అంత్యక్రియలు అవగానే ఒక రోజుగ్యాప్ లోనే రవితేజ షూటింగ్ లో పాల్గొన్నాడట.
రవితేజ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో RT76 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకొని శరవేగంగా చేస్తున్నారు. తండ్రి చనిపోయిన రెండు రోజులకే రవితేజ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
Also Read : Fahadh Faasil : ఇంకా కీప్యాడ్ ఫోన్ వాడుతున్న పుష్ప విలన్.. కానీ ఫోన్ ధర మాత్రం లక్షల్లో..
ఆల్రెడీ షూటింగ్ షెడ్యూల్ జరుగుతుంటే మధ్యలో చనిపోయారు రవితేజ తండ్రి. దాంతో షూటింగ్ కి రెండు రోజులు గ్యాప్ ఇచ్చారు. ఇంకా ఎక్కువ గ్యాప్ ఇస్తే నిర్మాతకు నష్టం చేకూరుతుందని ఆలోచించి, తనకు సినిమా మీద ఉన్న డెడికేషన్ తో మూడో రోజే షూటింగ్ కి వచ్చేసారు రవితేజ. దీంతో మాస్ మహారాజ ఫ్యాన్స్ సినిమా డెడికేషన్ అంటే ఇది కదా అని అభినందిస్తున్నారు.