Prabhas : రెండేళ్లలో ప్రభాస్ నాలుగు సినిమాలు రిలీజ్.. నిజంగానే రిలీజ్ చేస్తాడా?

రెండేళ్లో ప్రభాస్ వి 4 సినిమాలు రిలీజ్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు ఫాన్స్.

Prabhas Planning Four Movies in Two Years Rumours Goes Viral

Prabhas : ప్రభాస్ సినిమా అంటే ఫాన్స్ కి పండగే. అందుకే ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని పాన్ ఇండియా ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ వరకూ ఏమో కానీ ఈ సంవత్సరం నుంచి ప్రభాస్ ఫాన్స్ కి డబుల్ ఎంటర్ టైన్మెంట్ గ్యారంటీ అంటున్నారు ప్రభాస్. ప్రభాస్ సినిమాలకు సంబంధించిన న్యూస్ తో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు.

ప్రభాస్ ప్రస్తుతం అరడజను సినిమాలతో ఎంగేజ్ అయ్యి ఉన్నారు. ఈ సినిమాలన్నీ ఒకదానికి మించి ఒకటి ఇంట్రస్టింగ్ స్టోరీతో తెరకెక్కుతున్నాయి. కల్కి 2, రాజాసాబ్, హను రాఘవపూడి సినిమా, స్పిరిట్, సలార్ 2 సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. వీటిలో కల్కి 2 రిలీజ్ గురించి ఇటీవల నిర్మాత అశ్వినీదత్ మాట్లాడారు. ప్రభాస్ – నాగశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన కల్కికి సీక్వెల్ గా కల్కి 2 రాబోతోంది. ఇప్పటికే కొంత షూట్ చేసిన టీమ్ త్వరలోనే ఫుల్ ఫ్లెడ్జ్ షూట్ స్టార్ట్ చేసి సినిమాని వచ్చే సంవత్సరమే రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు నిర్మాత.

Also Read : Venkatesh : సీనియర్ హీరోలు వెంకటేష్ ని ఫాలో అవుదామనుకుంటున్నారట..

దీంత ఈ రెండేళ్లో ప్రభాస్ వి 4 సినిమాలు రిలీజ్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు ఫాన్స్. 2025 – 2026 లో ప్రభాస్ 4 సినిమాల్ని రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా రాజాసాబ్ సంక్రాంతి పోస్టర్ లో ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో లేనంత హ్యాండ్సమ్ గా ప్రభాస్ కనిపించడంతో రాజాసాబ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు జనాలు. ఏప్రిల్ 10న అని అంతకుముందు రిలీజ్ డేట్ ఇచ్చినా లేటెస్ట్ గా ప్రభాస్ సినిమా ఎప్పుడు రిలీజైతే అప్పుడే పండగ అంటూ ట్రిక్కీ పోస్ట్ పెట్టింది టీమ్. దీంతో ఆ డేట్ కి రాకపోయినా లేట్ అయినా సరే ఈ సంవత్సరమే రాజసాబ్ రిలీజ్ అన్నది మాత్రం పక్కా అంటున్నారు.

ఈ సంవత్సరం ఆల్రెడీ రాజాసాబ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీ తర్వాత అంతే స్పీడ్ గా హనురాఘవపూడి కాంబినేషన్లో ఫౌజీ అనేవర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు ప్రభాస్. పీరియాడిక్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించబోతున్నారని, స్టోరీ కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాని ఈ ఇయర్ ఎండ్ కి కానీ లేదా నెక్ట్స్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లోనే రిలీజ్ చేస్తారన్న టాక్ నడుస్తోంది.

Also Read : Mahesh Babu : మహేష్ బాబు ‘సంక్రాంతికి వస్తున్నాం’ రివ్యూ.. పర్ఫెక్ట్ పండగ సినిమా అంటూ..

ఇక బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్ కి సలార్ తో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు ప్రశాంత్ నీల్. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన మ్యాసివ్ బ్లాక్ బస్టర్ సలార్ కి సీక్వెల్ గా సలార్ 2 నెక్ట్స్ లెవల్ మేకింగ్ తో రాబోతోందని లేటెస్ట్ అప్ డేట్ వైరల్ అవుతోంది. ఆల్రెడీ సలార్ లోనే హై ఓల్టేజ్ యాక్షన్ చూపించిన ప్రభాస్ సలార్ 2 లో నెవర్ బిఫోర్ రేంజ్ లో యాక్షన్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాని కూడా నెక్ట్స్ ఇయర్ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. గతంలో ఆదిపురుష్ సమయంలో ప్రభాస్ సంవత్సరానికి రెండు సినిమాలతో రావడానికి ట్రై చేస్తాను అని చెప్పాడు. దీంతో చెప్పినట్టే ఈ రెండేళ్లలో కల్కి 2, సలార్ 2, రాజాసాబ్, హను రాఘవపూడి.. 4 సినిమాల రిలీజ్ టార్గెట్ గా బరిలోకి దిగుతున్నారు ప్రభాస్. అన్ని అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే నాలుగు సినిమాలు రిలీజయి ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే.