Venkatesh : సీనియర్ హీరోలు వెంకటేష్ ని ఫాలో అవుదామనుకుంటున్నారట..
సంక్రాంతికి వస్తున్నాం సినిమా క్రేజ్ చూసి సీనియర్ హీరోలు అలాంటి స్క్రిప్ట్‌లు కావాలని డైరెక్టర్స్‌కు చెప్తున్నట్లు టాక్.

Chiranjeevi Nagarjuna Balakrishna Wants Venkatesh Sankranthiki Vasthunnam Type Movies
Venkatesh : యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్, రొమాంటిక్, లవ్ ఎన్ని జానర్స్ ఉన్నా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీస్‌కు అయితే ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. హీరో వెంకటేశ్ మూవీ ఎప్పుడూ వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్‌ను డిసప్పాయింట్ చేయదు. వెంకీ పికప్ చేసుకునే స్టోరీస్ అలానే ఉంటాయి. సీనియర్ హీరోగా మరిన తర్వాత ఆయన తీసిన F2 మూవీ ఎంతలా ప్రేక్షకులను ఆకట్టుకుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత F3 కూడా అలాగే ఆకట్టుకుంది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం మూవీ కూడా ఫుల్ హిట్ టాక్ తెచ్చుకుంది.
వెంకీ ఫాలో అవుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీస్ ఫార్ములా సక్సెస్ అవ్వటం, సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తుండటంతో మిగతా స్టార్ హీరోలు కూడా ఆయన రూట్‌లోకి వెళ్లాలని చూస్తున్నారట. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున గతంలోనే ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు బోలెడన్ని చేసారు. కానీ ఆ తర్వాత మాస్ కి మారిపోయారు. నాగ్ మధ్యమధ్యలో బంగార్రాజు లాంటి ఫ్యామిలీ ఎంటెర్టైనర్లు చేస్తున్నారు.
Also Read : Mahesh Babu : మహేష్ బాబు ‘సంక్రాంతికి వస్తున్నాం’ రివ్యూ.. పర్ఫెక్ట్ పండగ సినిమా అంటూ..
ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా క్రేజ్ చూసి సీనియర్ హీరోలు అలాంటి స్క్రిప్ట్‌లు కావాలని డైరెక్టర్స్‌కు చెప్తున్నట్లు టాక్. చిరంజీవి ఆల్రెడీ అనిల్ రావిపూడితో ఫుల్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రిప్ట్ రెడీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అనిల్ స్వయంగా చిరంజీవితో సినిమా ఉంటుందని ప్రకటించాడు. విశ్వంభర సినిమా కంప్లీట్ కాగానే శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేస్తూనే మరోవైపు అనిల్ రావిపూడితో కూడా మూవీ చేయాలని అనుకుంటున్నాడట బాస్. వచ్చే సంక్రాంతికి అనిల్ రావిపూడి – చిరంజీవి సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.
ఇక బాలకృష్ణ కూడా అఖండ-2తో పాటు మరో కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా చేస్తున్నాడని అంటున్నారు. బాలయ్య బాబు కామెడీ ఎంటర్టైనర్ చేసి చాలా ఏళ్ళు అయిపోయింది. మరి ఈ సమయంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే బాలయ్య బాబు ఎలా తీస్తాడో చూడాలి.
ఇక నాగార్జున కుబేర, కూలీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాంటి సినిమాలతో పాటు హలో బ్రదర్, బంగార్రాజు లాంటి కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీకి ప్లాన్ చేస్తున్నాడట. ఇలా స్టార్ హీరోలందరూ వెంకటేశ్‌ను ఫాలో అవుతున్నారని టాక్. మరి వెంకీమామ లాగా మిగతా హీరోలు ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకుంటారా లేదా అన్నది చూడాలి మరి.