Salaar : సలార్ సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్.. హిట్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలి..

వేరే రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లో సలార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయకపోవడం గమనార్హం.

Prabhas Prashanth Neel Salaar Movie Pre Release Business Details

Salaar Pre Release Business : ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా రాబోతున్న సలార్ పార్ట్ 1 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 22న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అలాగే సలార్ సినిమా కలెక్షన్స్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. కానీ అసలు సినిమా ప్రమోషన్స్ చేయట్లేదని మరో పక్క బాధపడుతున్నారు ప్రభాస్ అభిమానులు.

ఇప్పటికే వేరే రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లో సలార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయకపోవడం గమనార్హం. ఇక సలార్ సినిమాకు థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. ప్రభాస్ తో పాటు ప్రశాంత్ నీల్ మీదున్న నమ్మకంతో థియేట్రికల్ రైట్స్ భారీగా అమ్ముడయ్యాయి. టాలీవుడ్ సమాచారం ప్రకారం తెలంగాణ థియేట్రికల్ హక్కులు 65 కోట్లకు, ఆంధ్ర థియేట్రికల్ హక్కులు 95 కోట్లు, కేరళ, కర్ణాటక, తమిళనాడు మూడు రాష్ట్రాలు కలిపి 65 కోట్లకు, నార్త్ మొత్తం 110 కోట్లకు, మిగిలిన తెలుగు సినిమాలు రిలీజయ్యే దేశాలు ఓవర్సీస్ లో 75 కోట్లకు సలార్ రైట్స్ అమ్ముడుపోయాయి.

Also Read : Mr Bachchan : రవితేజ హరీష్ శంకర్ సినిమా కూడా రీమేకేనా? బాలీవుడ్ సినిమా రీమేక్‌తో మాస్ మహారాజ..

మొత్తం దాదాపు 405 కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయాయి. అంటే కనీసం ఈ సినిమా 810 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అయినట్టే. ఇక కనీస లాభాలు రావాలంటే 1000 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సాధించాల్సిందే సలార్ సినిమా. బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో ప్రభాస్ సినిమాలకు కలెక్షన్స్ రాలేదు. మరి ఈ సినిమాతో అయినా భారీ హిట్ కొడతాడేమో చూడాలి. ఇక థియేట్రికల్ బిజినెస్ కాకుండా డిజిటల్, మ్యూజిక్ రైట్స్, శాటిలైట్ రైట్స్ తో నిర్మాతలకు బాగానే ప్రాఫిట్స్ వచ్చినట్టు తెలుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు