Salaar : బాహుబలి తర్వాత భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్(Prabhas) కి సలార్ సినిమాతో ఓ రేంజ్ హిట్ లభించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా థియేటర్స్ లో భారీ విజయం సాధించి 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. దీని పార్ట్ 2 కూడా ఉండటంతో సలార్ 2 కోసం ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
ఇటీవల ఎంత పెద్ద సినిమాలైనా రిలీజయిన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. సలార్ లాంటి భారీ హిట్ సినిమాలు కొంచెం టైం తీసుకుంటాయి అనుకున్నారు. కానీ సలార్ నెల రోజుల్లోపే ఓటీటీ బాట పట్టింది. సలార్ సినిమా నెట్‌ఫ్లిక్స్(Netflix) లో వస్తుందని గతంలోనే ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్ లో సలార్ సినిమా జనవరి 20 నుంచే స్ట్రీమింగ్ ఇవ్వబోతుంది.
Also Read : సారీ చెప్పిన నయనతార.. ‘అన్నపురాణి’ సినిమా వివాదంపై స్పందించి.. జై శ్రీరామ్ అంటూ..
ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే నెట్ ఫ్లిక్స్ సలార్ స్ట్రీమింగ్ కి రెడీ అయింది. నెట్‌ఫ్లిక్స్ లో సడెన్ గా సలార్ స్ట్రీమింగ్ రేపట్నుంచి అని తెలియడంతో ఆశ్చర్యపోతున్నారు అభిమానులు, ప్రేక్షకులు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో సలార్ సినిమా రేపు ఉదయం నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. హిందీలో తర్వాత రిలీజ్ అవుతుందని సమాచారం. ఇంకెందుకు ఆలస్యం థియేటర్స్ లో మిస్ అయినవాళ్లు నెట్‌ఫ్లిక్స్ లో చూసేయండి ప్రభాస్ సలార్ సినిమాని.
ఇక ఇటీవలే సలార్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా బెంగళూరులోని హోంబలె నిర్మాణ సంస్థ ఆఫీస్ లో సెలబ్రట్ చేసుకోగా చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు.
#Salaar will be streaming on Netflix India from tonight at 12AM.
Tel. Tam. Kan. Mal. pic.twitter.com/zzu8xnJ0MS
— Streaming Updates (@OTTSandeep) January 19, 2024