prabhas prithviraj sukumaran salaar is filming based on mahabharata
Salaar : ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా సలార్. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన యాక్షన్ కట్ ట్రైలర్ ఆడియన్స్ లో సినిమా పై భారీ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. దీంతో ఈ మూవీని థియేటర్స్ లో ఎప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యిపోయాయి. తెలంగాణలో అయితే టికెట్స్ ని థియేటర్స్ వద్దనే అమ్ముతున్నారు. దీంతో థియేటర్స్ వద్ద టికెట్స్ కోసం అభిమానులు బారులు తీరారు.
ఇది ఇలా ఉంటే, సలార్ కథ గురించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. మహాభారతాన్ని మార్చి సలార్ సినిమాని తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమా ఇద్దరు ప్రాణ మిత్రులు శత్రువులుగా ఎలా మారారు అనే కథాంశంతో వస్తుందని ప్రశాంత్ నీల్ తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పాయింట్ ని చూపిస్తూనే మహాభారతంతో పోలుస్తున్నారు. మహాభారతంలో దుర్యోధనుడు, కర్ణుడు స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పు అన్ని తెలిసినా తనని నమ్మిన మిత్రుడు కోసం కర్ణుడు చివరి వరకు తోడుగా నిలిచి ప్రాణాలు విడిచారు.
Also read : Salaar : సలార్ స్పెషల్ షోలకు పర్మిషన్.. టికెట్ రేట్లు ఎంతో తెలుసా..?
అయితే సలార్ కోసం ఈ కథని మార్చబోతున్నారట. దుర్యోధనుడు చేసిన తప్పుని కర్ణుడు ప్రశ్నించి, ఎదురిస్తే అది సలార్ కథ అని తెలుస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కోసం ఫైట్ చేసే ప్రభాస్‌కి.. ఆ మిత్రుడు చేసే పనులు నచ్చకపోవడంతో ఎదురు తిరుగుతాడు. ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్న టీంను ఆనంద్ కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సలార్ చిత్రాన్ని మహాభారతంతో పోల్చి చెప్పారు. సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్ మధ్య స్నేహం చాలా ఎమోషనల్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు. బాహుబలిలో రాముడి వంటి పాత్రలో కనిపించిన ప్రభాస్.. ఇప్పుడు సలార్ లో కర్ణుడు వంటి పాత్రలో కనిపించబోతున్నారు. బాహుబలి తరువాత మళ్ళీ అలాంటి విజయం లేని ప్రభాస్‌కి సలార్ ఆ రేంజ్ హిట్ ఇస్తుందా లేదా చూడాలి.