Salaar : సలార్ స్పెషల్ షోలకు పర్మిషన్.. టికెట్ రేట్లు ఎంతో తెలుసా..?

సలార్ స్పెషల్ షోలకు, టికెట్ పెంపుకు అనుమతి ఇచ్చిన గవర్నమెంట్.

Salaar : సలార్ స్పెషల్ షోలకు పర్మిషన్.. టికెట్ రేట్లు ఎంతో తెలుసా..?

Prabhas Salaar Part 1 Ceasefire ticket price and special shows details

Updated On : December 19, 2023 / 6:52 PM IST

Salaar : ప్రభాస్ సలార్ మొదటి భాగం సీజ్ ఫైర్ మరో మూడు రోజుల్లో ఆడియన్స్ ని పలకరించబోతుంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన యాక్షన్ కట్ ట్రైలర్ ఆడియన్స్ లో సినిమా పై భారీ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. దీంతో ఈ మూవీ బుకింగ్స్ ని ఎప్పుడు ఓపెన్ చేస్తారా..? ఎప్పుడు టికెట్స్ కొనుగోలు చేద్దామా అని ఎదురు చూస్తున్నారు. అలాగే స్పెషల్ షోలు ఏమన్నా ఉంటాయా అని వెయిట్ చేస్తున్నారు.

తెలంగాణలో స్పెషల్ షోలకు అనుమతిని ఇచ్చారు. మొదటిరోజు మొత్తం ఆరు షోలు పడబోతున్నాయి. అలాగే కొన్ని సెలెక్టెడ్ చేసిన థియేటర్స్ లో తెల్లవారుజామున ఒంటిగంట షో కూడా వేయనున్నారు. ఇక తెలంగాణలో టికెట్ రేట్లు విషయానికి వస్తే.. సింగిల్ స్క్రీన్స్ లో 250, 175, 100 రేట్లు, మల్టీఫెక్స్ ల్లో 370, 470 ధరతో టికెట్స్ ని నిర్ణయించారు. సాధారణ టికెట్ రేట్లుతో పోలిస్తే.. మల్టీఫెక్స్ ల్లో రూ.100, సాధారణ థియేటర్లలో రూ.55 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో 10 రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో రూ.40 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.

Also read : Suhas : సుహాస్ కొత్త సినిమాకి సలార్ డైలాగ్ రైటర్ దర్శకుడా..?

తెలంగాణ థియేటర్ హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ సలార్ సినిమాతో థియేటర్స్ వద్ద పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు ఒక నిర్ణయం తీసుకున్నారు. సలార్ సినిమా టికెట్స్ నైజాం వరకు థియేటర్స్ వద్దే అమ్ముతారని, ఆన్లైన్ లో టికెట్ బుకింగ్స్ ఉండవని తెలియజేశారు. ఇది తెలిసి అభిమానులు షాక్ అయ్యారు. పలువురు దీనిపై విమర్శలు చేస్తున్నారు. ఆల్రెడీ టికెట్స్ అమ్మకాలు మొదలయ్యాయి. థియేటర్ వద్ద అభిమానులు మల్లి క్యూ లైన్స్ లో టికెట్స్ కోసం కష్టపడుతున్నారు.