Suhas : సుహాస్ కొత్త సినిమాకి సలార్ డైలాగ్ రైటర్ దర్శకుడా..?
ప్రభాస్ సినిమాకి రైటర్ గా పని చేసిన రచయితతో టాలీవుడ్ నటుడు సుహాస్ హీరోగా సినిమా అనౌన్స్.

Suhas announce his new movie with Prabhas Salaar dialogue writer
Suhas : టాలీవుడ్ నటుడు సుహాస్ హీరోగా వరుస సినిమాలు ప్రకటిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇటీవల హీరోగా ఏకంగా ఆరు సినిమాలు అనౌన్స్ చేసిన సుహాస్.. ఇప్పుడు మరో కొత్త సినిమాని కూడా ప్రకటించారు. అది కూడా ప్రభాస్ సినిమాకి రైటర్ గా పని చేసిన రచయిత అని తెలుస్తుంది. నేడు ఈ మూవీ లాంచ్ ఈవెంట్ జరిగింది. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఈ సినిమా తెరకెక్కబోతుంది. నేడు జరిగిన లాంచ్ ఈవెంట్ కి ప్రశాంత్ నీల్, అనిల్ రావిపూడి, వేణు అతిథిలుగా వచ్చారు.
ప్రశాంత్ నీల్ క్లాప్ కొట్టగా, అనిల్ రావిపూడి కెమెరా స్విచ్ ఆన్ చేశారు, వేణు మొదటి సీన్ కి దర్శకత్వం వహించారు. అయితే ఈ ఈవెంట్ కి ప్రశాంత్ నీల్ రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అసలు ఆయన ఎందుకు వచ్చారని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు కారణం సుహాస్ సినిమాని డైరెక్ట్ చేయబోయే దర్శకుడే అని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని సందీప్ బండ్ల డైరెక్ట్ చేయబోతున్నారు. ఈయన సలార్ సినిమాకి డైలాగ్ రైటర్ గా పని చేశారని తెలుస్తుంది. మరి ఈ వార్త నిజామా అనేది తెలియదు. కానీ ప్రశాంత్ నీల్, సుహాస్ సినిమాని లాంచ్ చేయడం వైరల్ గా మారింది.
Also read : HanuMan : హనుమాన్ చిత్రానికి బీజేపీ సపోర్ట్ ఉందా.. తనని చిన్న చూపు చూశారంటున్న తేజ సజ్జ..
ఇక ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల భారీ విజయం అందుకున్న బేబీ మూవీకి ఈ దర్శకుడే సంగీతం అందించారు. సంగీర్తన ఈ సినిమాలో సుహాస్ కి జోడిగా కనిపించబోతున్నారు. ఈ హీరోయిన్ ఇప్పటికే తెలుగులో రెండు సినిమాల్లో నటించారు. కోర్ట్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతుందట. సుహాస్ ఈ చిత్రం లాయర్ కనిపించవచ్చు. కంప్లీట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కబోతుంది.