Prabhas: ప్రాజెక్ట్-K సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించబోతున్నాడా?

నేడు(అక్టోబర్ 23) పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కావడంతో.. రెబల్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుతున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రభాస్ సూపర్ హిట్ మూవీ ‘బిల్లా’ని రీ రిలీజ్ చేయడంతో, థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకుంది. అలాగే ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం ప్రాజెక్ట్-K నుంచి కూడా డార్లింగ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది.

Prabhas Project K Movie Poster Released

Prabhas: నేడు(అక్టోబర్ 23) పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కావడంతో.. రెబల్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుతున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రభాస్ సూపర్ హిట్ మూవీ ‘బిల్లా’ని రీ రిలీజ్ చేయడంతో, థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకుంది. అలాగే ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం ప్రాజెక్ట్-K నుంచి కూడా డార్లింగ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది.

Prabhas: ప్రభాస్ ఇమేజ్ ని వాడుకుంటున్న దర్శకులు.. ఆవేదనలో అభిమానులు!

మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోణె నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కొత్త పోస్టర్ ని నేడు విడుదల చేసింది మూవీ టీం. ఈ పోస్టర్ లో ప్రభాస్ తన చేతికి మర్వెల్ హీరో ఐరన్ మ్యాన్ ధరించినట్లు ప్రత్యేకంగా రూపొందించిన ఒక కవచాన్ని ధరించి కనిపిస్తుంది.

ప్రభాస్ చెయ్యిని మాత్రమే చూపిస్తూ.. “హీరోలు పుట్టుకు రారు, ఉద్భవిస్తారు” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ప్రభాస్ ఈ సినిమాలో ఒక సూపర్ హీరోగా కనిపించబోతున్నాడంటూ అభిమానులు అనుమానాలు రేకేతిస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన అమితాబ్ బచ్చన్ పోస్టర్ కూడా ఈ వార్త నిజమనేలా ఉంది. కాగా ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీ నుంచి కూడా కొత్త పోస్టర్ ని విడుదల చేసారు మేకర్స్.