Prabhas: ప్రభాస్ ఇమేజ్ ని వాడుకుంటున్న దర్శకులు.. ఆవేదనలో అభిమానులు!

నేడు టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కావడంతో డార్లింగ్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభాస్ సూపర్ హిట్ మూవీ 'బిల్లా'ని రీ రిలీజ్ చేయడంతో, థియేటర్ల వద్ద రెబల్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. కాగా ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమాల నుంచి కూడా అప్డేట్ లు విడుదలవుతున్నాయి.

Prabhas: ప్రభాస్ ఇమేజ్ ని వాడుకుంటున్న దర్శకులు.. ఆవేదనలో అభిమానులు!

Prabhas: నేడు టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కావడంతో డార్లింగ్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభాస్ సూపర్ హిట్ మూవీ ‘బిల్లా’ని రీ రిలీజ్ చేయడంతో, థియేటర్ల వద్ద రెబల్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. కాగా ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమాల నుంచి కూడా అప్డేట్ లు విడుదలవుతున్నాయి.

Prabhas Fans : ప్రభాస్ అభిమానుల అత్యుత్సాహం.. తణుకులో కుర్చీలు ధ్వంసం.. తాడేపల్లిగూడెంలో మంటల్లో కుర్చీలు..

ఈ నేపథ్యంలోనే నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్-K చిత్రం నుంచి కూడా పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పోస్టర్ లో ప్రభాస్ చెయ్యి మాత్రమే చూపిస్తూ.. “హీరోలు పుట్టుకు రారు, ఉద్భవిస్తారు” అంటూ చెప్పుకొచ్చారు. గతంలో అమితాబ్ బర్త్ డేకి విడుదల చేసిన పోస్టర్ బట్టి చూస్తే ఇది ఒక సూపర్ హీరో కథాంశంతో రాబోతున్నట్టు తెలుస్తుంది.

బాహుబలితో వచ్చిన ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ ని దర్శకులు వాడుకుంటున్నారు తప్ప కథపై ద్రుష్టి పెట్టడం లేదు. అనవసరపు హంగులకు పోయి.. ప్రభాస్ కెరీర్ ని నాశనం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. నాగ్ అశ్విన్ అయిన కథ పట్ల జాగ్రత్తలు వహించాలంటూ సోషల్ మీడియా వేదికగా వారి ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు.