Prabhas Fans : ప్రభాస్ అభిమానుల అత్యుత్సాహం.. తణుకులో కుర్చీలు ధ్వంసం.. తాడేపల్లిగూడెంలో మంటల్లో కుర్చీలు..

నేడు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా బిల్లా సినిమాలని రెండు తెలుగు రాష్ట్రాలలో పలు థియేటర్స్ లో స్పెషల్ షోలు వేశారు. దీంతో అభిమానులు థియేటర్స్ కి పోటెత్తారు. అయితే కొంతమంది అభిమానులు అత్యుత్సాహం చూపించారు.....................

Prabhas Fans : ప్రభాస్ అభిమానుల అత్యుత్సాహం.. తణుకులో కుర్చీలు ధ్వంసం.. తాడేపల్లిగూడెంలో మంటల్లో కుర్చీలు..

Prabhas Fans Damaged Theater property

Prabhas Fans :  రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు నేడు. దీంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రభాస్ పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కొంతమంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కొంతమంది స్పెషల్ షోలతో సందడి చేస్తున్నారు. ఇటీవల స్టార్ హీరోల పుట్టిన రోజులకి వారి పాత సినిమాలు రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

దీంతో నేడు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా బిల్లా సినిమాలని రెండు తెలుగు రాష్ట్రాలలో పలు థియేటర్స్ లో స్పెషల్ షోలు వేశారు. దీంతో అభిమానులు థియేటర్స్ కి పోటెత్తారు. అయితే కొంతమంది అభిమానులు అత్యుత్సాహం చూపించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా వి మాక్స్ థియేటర్లో ప్రత్యేక షో వేశారు. దీనికి భారీగా అభిమానులు వచ్చారు. సినిమా మొదలయ్యాక ప్రభాస్ అభిమానులు అరుపులు. ఈలలు, కేరింతలతో హడావిడి చేశారు. కొంతమంది అభిమానులు కుర్చీలపైకి ఎక్కి డ్యాన్సులు వేస్తూ వాటిని విరగ్గొట్టారు. దీంతో థియేటర్స్ లో పలు కుర్చీలు ధ్వంసం అయ్యాయి. దీంతో థియేటర్ యాజమాన్యం సీరియస్ అయి అభిమాన సంఘం నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

Anudeep KV : దయచేసి నన్ను ఎవరూ నటించమని అడగొద్దు.. నా నెక్స్ట్ సినిమా..

అలాగే తాడేపల్లిగూడెంలోని ఓ థియేటర్లో అభిమానులు క్రాకర్స్ తెచ్చి కాల్చడంతో కుర్చీలు అంటుకున్నాయి. దీంతో కొన్ని కుర్చీలు మంటల్లో కాలిపోయాయి. దీనిపై థియేటర్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా వేరే హీరోల సినిమాల రీ రిలీజ్ లకి ఆయా హీరోల అభిమానులు కూడా కొంతమంది అత్యుత్సాహం చూపించి థియేటర్లకు నష్టం కలిగించారు.