Prabhas
Prabhas : బుజ్జిగాడు సినిమాతో పూరి జగన్నాథ్, ప్రభాస్ కాంబినేషన్ ఒకప్పుడు టాలీవుడ్‌లో సూపర్ హిట్ అయింది. ఆ యాక్షన్-కామెడీ స్టైల్, మాస్ ఎనర్జీ.. ఫ్యాన్స్‌ను ఫుల్ ఫిదా చేసింది. ఏక్ నిరంజన్ తో ఓ డిఫరెంట్ సినిమాని చూపించారు. ఇప్పుడు మళ్లీ ఆ ఇద్దరి కాంబోలో మూవీ రాబోతోందనే చర్చ మొదలైంది.(Prabhas)
ఆ మధ్య ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సర్‌ప్రైజ్ విజిట్ చేయడంతో ఫ్యాన్స్‌లో క్రేజ్ పెరిగిపోయింది. ఈ మీట్ తర్వాత ఇద్దరూ మళ్లీ కలిసి సినిమా చేస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో పాన్-ఇండియా లెవల్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేసినప్పటికీ పూరి, డార్లింగ్ నుంచి బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ లాంటి మూవీస్‌ను కోరుకుంటున్నారు ఫ్యాన్స్.
Also Read : Varalaxmi SarathKumar : ఇండస్ట్రీలో మహిళలు ఎదగడానికి హెల్ప్ చేయండి.. స్టేజిపై ఎమోషనల్ అయిన వరలక్ష్మి..
రాజాసాబ్ సెట్స్‌కు పూరి, ఛార్మీ కలిసి వచ్చి ప్రభాస్‌ని హగ్ చేసుకోవడం, ఫోటోలు వైరల్ అవ్వడంతో గాసిప్స్ ఎక్కువై పోయాయి. ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్, బాండింగ్ గురించి ప్రభాస్ ఇటీవల ఇంటర్వ్యూల్లో మాట్లాడుతున్నాడు కూడా. తాజాగా కపుల్ ఫ్రెండ్లీ సక్సెస్ ఇంటర్వ్యూలో ప్రభాస్ పాల్గొనగా పూరి జగన్నాథ్ లాగా ఎవరూ రాయలేరు, బుజ్జిగాడు నా ఫేవరేట్ అంటూ పూరిని ఆకాశానికెత్తేశారు. దీంతో పూరితో ప్రభాస్ సినిమా అంటూ మరోసారి ఊహాగానాలు వస్తున్నాయి.
ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ మూవీ బిజీలో ఉన్నాడు. మరోవైపు స్పిరిట్ సినిమా కూడా చేస్తున్నాడు. ఇలా పాన్ ఇండియా స్టార్ గా దూసుకెళ్తున్నారు. ఆ తర్వాత సీక్వెల్ ప్లానింగ్స్ ఉన్నాయి. పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతితో మూవీ చేస్తుండగా ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత డార్లింగ్‌తో సినిమాకు ప్లాన్ చేసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వీళ్లద్దరి కాంబినేషన్‌లో సినిమాపై ఓ క్లారిటీ రానప్పటికీ పూరీ కమ్ బ్యాక్ కోసం బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ లాంటి మాసీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Also Read : KH x RK Reunion : రజినీకాంత్ – కమల్ హాసన్ కలిసి సినిమా.. ప్రోమో వచ్చేసింది.. ఎవరు హీరో..