×
Ad

Akhanda 2-RajaSaab: అఖండ 2 బాటలోనే రాజాసాబ్?.. సంక్రాంతికి రిలీజ్ కష్టమేనా?.. ఆందోళనలో ఫ్యాన్స్..

ప్రభాస్ ఫ్యాన్స్ ని కొత్త టెన్షన్ పట్టుకుంది. ప్రభాస్ హీరోగా వస్తున్న రాజాసాబ్(Akhanda 2-RajaSaab) సినిమా వాయిదా పడనుందా.

Prabhas 'Raja Saab' movie to be postponed due to financial transaction issues

Akhanda 2-RajaSaab: ప్రస్తుతం ఉన్న పరిస్థితులల్లో సినిమాలు చేయడం కాదు వాటిని రిలీజ్ చేయడం అనేది కష్టంగా మారిపోయింది మేకర్స్ కి. ఏటినుంచి ఏ అవాంతరం వచ్చి సినిమా విడుదల ఆగుతుందా అని భయపడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ముందు నుంచి ఎంత ప్లాన్ చేసుకున్నా అనుకున్న టైంకి రిలీజ్ చేయడం జరగడం లేదు. ఒకటి కాదు రెండు కాదు ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు ఇలా వాయిదా పడుతూ వచ్చినవే. దానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. తఇలా వాయిదా పడుతూ వచ్చిన సినిమాల ఫలితాలు కూడా ఫేలవంగానే ఉండటంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి భారీ (Akhanda 2-RajaSaab)అంచనాల మధ్య వస్తున్న సినిమా అఖండ 2.

Netflix-Warner Bros: నెట్‌ఫ్లిక్స్‌ చేతికి వార్నర్‌ బ్రదర్స్‌.. ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో భారీ డీల్.. ఎన్ని లక్షల కోట్లో తెలుసా..?

బాలకృష్ణ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కించాడు. బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తుండటంతో సహజంగానే ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ఇక అన్ని సెట్ అయ్యాయి డిసెంబర్ 5న విడుదల అవుతుంది అని ఫిక్స్ అయ్యారు అంతా. ఇక నందమూరి బాలకృష్ణ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కానీ, తీరా చూస్తే చివరి క్షణంలో ఈ సినిమా వాయిదా పడింది. దీంతో, అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు. అఖండ 2 నిర్మాణ సంస్థ గతంలో చేసిన సినిమాల ప్రభావం వల్ల, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవడంవల్ల ఈ సినిమా విడుదలను తాత్కాలికంగా వాయిదా వేస్తూ అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. కానీ, త్వరలోనే ఈ సమస్య కొలిక్కి వస్తుంది అంటూ ఇండస్ట్రీ నుంచి టాక్ వస్తోంది.

అయితే, ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ,ఇప్పుడు ఈ టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్ ని పట్టుకోనుంది. ఎందుకంటే, ప్రభాస్ హీరోగా వస్తున్న రాజాసాబ్ సినిమాకి కూడా ఇలాంటి సమస్యే ఎదురుకానుందట. ఈ సినిమాను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ కూడా ఆర్ధిక లావాదేవీల సమస్యలో ఉందట. అవి సెట్ చేస్తే కానీ రాజాసాబ్ సినిమా విడుదల కాదు అనే టాక్ ఇండస్ట్రీ నుంచి బలంగా వినిపిస్తోంది. అదే కనుక జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు బాలకృష్ణ ఫ్యాన్స్ లాగా బాధపడాల్సి వస్తుంది. అనుకున్న సమయానికి చెప్పుకుంటే రాజాసాబ్ సినిమా 2026 జనవరి 9న విడుదల కావాలి. కానీ, కొంచం తేడా వచ్చినా మరోసారి ఈ సినిమా వాయిదా పడే అవకాశం బలంగా కనిపిస్తోంది. మరి ఆ టైం వరకు మేకర్స్ ఏమైనా సెట్ చేసుకుంటారా అనేది చూడాలి. ఏది ఏమైనా ఇలా సినిమాల వాయిదాల విషయంలో మాత్రం అభిమానులు చాలా డిజప్పాయింట్ అవుతున్నారు అలాగే, ఆందోళన చెందుతున్నారు.