Netflix-Warner Bros: నెట్‌ఫ్లిక్స్‌ చేతికి వార్నర్‌ బ్రదర్స్‌.. ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో భారీ డీల్.. ఎన్ని లక్షల కోట్లో తెలుసా..?

ఇంటర్నేషనల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో కనీవినీ ఎరుగని భారీ డీల్‌ జరుగనుంది. ప్రముఖ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ(Netflix-Warner Bros)కి సంబందించిన స్టూడియోలు, స్ట్రీమింగ్‌ యూనిట్‌లను కొనుగోలు చేసేందుకు నెట్‌ఫ్లిక్స్‌ ఒప్పందం చేసుకుంది.

Netflix-Warner Bros: నెట్‌ఫ్లిక్స్‌ చేతికి వార్నర్‌ బ్రదర్స్‌.. ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో భారీ డీల్.. ఎన్ని లక్షల కోట్లో తెలుసా..?

Netflix to buy Warner Bros Discovery

Updated On : December 5, 2025 / 7:41 PM IST

Netflix-Warner Bros: ఇంటర్నేషనల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో కనీవినీ ఎరుగని భారీ డీల్‌ జరుగనుంది. ప్రముఖ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ(Netflix-Warner Bros)కి సంబందించిన స్టూడియోలు, స్ట్రీమింగ్‌ యూనిట్‌లను కొనుగోలు చేసేందుకు నెట్‌ఫ్లిక్స్‌ ఒప్పందం చేసుకుంది. ఈ రెండు సంస్థల్లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్‌ ప్రపంచంలో అతిపెద్ద స్ట్రీమింగ్‌ సర్వీస్‌ కాగా.. వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ ప్రపంచంలోనే పురాతన స్టూడియోలు కలిగిన సంస్థ కావడం విశేషం. ప్రస్తుతం ఈ న్యూస్ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

Samantha: షూటింగ్ లో కొత్త పెళ్లికూతురు సమంత: హనీమూన్ లేదు.. వెకేషన్ లేదు.. పాపం

ఈ ఒప్పందం విలువ దాదాపు 72 బిలియన్‌ డాలర్లుగా తెలుస్తోంది. అనే మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.6.47 లక్షల కోట్లు. వార్నర్‌ బ్రదర్స్‌ కి సంబందించిన ఒక్కో షేరుకు 27.75 డాలర్లు చెల్లిస్తోంది నెట్‌ఫ్లిక్స్‌. ఈ ఒప్పందం ప్రకారం సీఎన్‌ఎన్‌, టీఎన్‌టీ, టీబీఎస్‌ వంటి కేబుల్‌ ఛానళ్లలో ఇప్పటికే ప్రారంభించిన మార్పులను వార్నర్‌ బ్రదర్స్‌ పూర్తి చేయాలి. దానికి సంబందించిన ప్రక్తియ పూర్తయిన వెంటనే కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుంది. ప్రస్తుతం హాలివుడ్‌లో అత్యంత విలువైన కంపెనీగా నెట్‌ఫ్లిక్స్‌ ఉంది. ఆ కంపెనీ ఈ స్థాయిలో కొనుగోలు చేపట్టడం ఇదే తొలిసారి అవడం విశేషం. ఇక ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తగానే హెచ్‌బీఓ నెట్‌వర్క్‌, ది సొప్రానోస్‌, ది వైట్‌ లోటస్‌ వంటి హిట్‌ షోల లైబ్రరీలు, హ్యారీ పోటర్‌, ఫ్రెండ్స్‌ వంటి సినిమాలు, టీవీ ఆర్కైవ్స్‌ వంటివి కూడా నెట్‌ఫ్లిక్స్‌ చేతుల్లోకి వెళతాయి.