Rajasaab Collections
Rajasaab Collections : మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాజాసాబ్ సినిమా జనవరి 9న రిలీజయింది. థియేటర్స్ లో ఈ సినిమా పర్వాలేదనిపిస్తుంది. మొదటి రోజు, ప్రీమియర్స్ కలిపి రాజాసాబ్ సినిమా 112 కోట్లు గ్రాస్ వచ్చినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల కాలంలో ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాల్లో ఇదే తక్కువ.(Rajasaab Collections)
తెలంగాణలో ప్రీమియర్స్ పడకపోవడం, బాలీవుడ్ లో నెగిటివ్ రివ్యూలు రావడం, ఏపీలో ప్రీమియర్ కి ఏకంగా వెయ్యి రూపాయలు టికెట్ పెట్టడం వల్ల సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ కి భారీ దెబ్బ పడింది. సినిమా మిక్స్‌డ్ టాక్ రావడంతో రెండో రోజు కూడా సినిమా కలెక్షన్స్ కి ఎఫెక్ట్ అయింది. రెండో రోజు కేవలం 40 కోట్ల గ్రాస్ వచ్చినట్టు సమాచారం.
Also See : The Rajasaab Success Meet: ది రాజా సాబ్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్.. ఫొటోలు
వరల్డ్ వైడ్ కేవలం 28 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ లెక్కన రాజాసాబ్ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తుంది. మూవీ యూనిట్ అధికారికంగా ఎన్ని కోట్లు ప్రకటిస్తారో చూడాలి.
రాజాసాబ్ సినిమాకు దాదాపు 200 కోట్ల థియేటరికల్ బిజినెస్ అయింది. అంటే కనీసం ఈ సినిమా 400 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. ఇవాళ రాత్రి నుంచి చిరంజీవి సినిమా, 14 వ తేదీన మిగతా సంక్రాంతి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలు కొంచెం మంచి టాక్ వచ్చినా రాజాసాబ్ కి కచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది.
గమనిక : ఈ కలెక్షన్స్ లెక్కలు వివిధ సోషల్ మీడియా, మీడియా మాధ్యమాల నుంచి సేకరించినవి. ఇవి నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు.