Balakrishna Prabhas
Balakrishna – Prabhas : ఇటీవల సినిమా రిలీజ్ డేట్స్ అనేది పెద్ద తలనొప్పి అయిపొయింది. చెప్పిన డేట్ కి అనుకున్న సినిమా రావడం కష్టమైపోతుంది. కనీసం వారం రోజులు అయినా వాయిదా పడుతుంది. ఒక సినిమా డేట్ మారితే దాని తర్వాత ఉండే అన్ని సినిమాల డేట్స్ మార్చాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు అఖండ 2, రాజాసాబ్ సినిమాల డేట్స్ మారతాయి అని టాలీవుడ్ టాక్.
బాలయ్య అఖండ 2 పై భారీ అంచనాలే ఉన్నాయి. దసరా కానుకగా సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ OG సినిమాతో పోటీ పడి రిలీజ్ కాబోతుంది. దసరా కాబట్టి రెండు సినిమాలు వచ్చినా పర్లేదు. కానీ అఖండ 2 ఇంకా షూట్ అవ్వకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్, vfx వర్క్స్ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమాని డిసెంబర్ కి వాయిదా వేస్తారని అంటున్నారు.
Also Read : Jabardasth : అనసూయ, నాగబాబు జబర్దస్త్ రీ ఎంట్రీ.. రావడంతోనే గొడవ..
అయితే డిసెంబర్ 5న ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ కానుంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చాన్నాళ్ళకు లవ్, కామెడీతో పాటు మొదటిసారి హారర్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు ఉన్నాయి. ఎలా అయినా డిసెంబర్ 5కి రిలీజ్ చేస్తానని ఇటీవల టీజర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ మారుతీ తెలిపాడు. ఒకవేళ బాలయ్య అఖండ 2 వాయిదా పడి డిసెంబర్ కి వస్తే రాజాసాబ్ వాయిదా తప్పదు. రాజాసాబ్ సినిమా కూడా ఇంకా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, VFX పనులు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రాజాసాబ్ సంక్రాంతికి వస్తే బెటర్ అని ప్లాన్ చేస్తున్నారట. సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా అయితే ఫిక్స్. దాంతో పాటు నవీన్ పోలిశెట్టి సినిమా ఉంది. ఇంకో సినిమా కూడా లిస్ట్ లో చేరుతుంది. మరి వీటితో ప్రభాస్ రాజాసాబ్ సంక్రాంతికి వస్తుందా లేక డిసెంబర్ లోనే రిలీజ్ చేస్తారా చూడాలి. ఒకవేళ రాజాసాబ్ వాయిదా పడితే సంక్రాంతికి మెగాస్టార్ – రెబల్ స్టార్ పోటీ తప్పదు.
Also See : Pooja Hegde : ‘పూజా హెగ్డే’ మోనికా సాంగ్ మేకింగ్ స్టిల్స్.. ఫొటోలు వైరల్..