Prabhas Salaar beats RRR digital and satellite rights records
Salaar : థియేటర్స్ వద్ద సలార్ సెలబ్రేషన్స్ మొదలయ్యిపోయాయి. తెలంగాణ థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్ టికెట్స్ ని థియేటర్స్ వద్దనే అమ్ముతామని తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ బుకింగ్స్ ని నేటి నుంచి ఓపెన్ చేసింది. దీంతో టికెట్స్ బుక్ చేసుకునేందుకు థియేటర్స్ వద్ద అభిమానులు బారులు తీరారు. అక్కడ కోలాహలం చూస్తుంటే ఈరోజే సినిమా రిలీజ్ లా కనిపిస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇది ఇలా ఉంటే, సలార్ సినిమా ఆర్ఆర్ఆర్ రికార్డుని బ్రేక్ చేసిందట. సలార్ తెలుగు టీవీ రైట్స్ ని స్టార్ మా దాదాపు రూ.22 కోట్లకు కొనుగోలు చేశారట. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా టీవీ రైట్స్ అన్ని భాషల్లో కలిపి 25 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. కేవలం టీవీ రైట్స్ మాత్రమే కాదు. మొత్తం డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ లోను సలారే టాప్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ 325 కోట్లకు అమ్ముడుపోతే, సలార్ 350 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇలా అన్ని విషయాల్లో సలార్ మూవీ ఆర్ఆర్ఆర్ రికార్డుని బ్రేక్ చేసిందని చెబుతున్నారు.
Also read : Salaar : ప్రభాస్ ఫ్యాన్స్ పై పోలిసుల లాఠీ ఛార్జ్.. బాహుబలి డేస్ బ్యాక్ అంటున్న రెబల్స్..
కాగా బాహుబలి కలెక్షన్స్ రికార్డుని బ్రేక్ చేయడం ఆర్ఆర్ఆర్ కి కూడా సాధ్యం కాలేదు. మరి సలార్ తో ప్రభాస్ ఆ రికార్డులను బ్రేక్ చేస్తాడా లేదా అనేది చూడాలి. ఇక సలార్ స్పెషల్ షోలు, టికెట్ రేట్లు విషయానికి వస్తే.. తెలంగాణలో స్పెషల్ షోలకు అనుమతిని ఇచ్చారు. మొదటిరోజు మొత్తం ఆరు షోలు పడబోతున్నాయి. అలాగే కొన్ని సెలెక్టెడ్ చేసిన థియేటర్స్ లో తెల్లవారుజామున ఒంటిగంట షో కూడా వేయనున్నారు. సాధారణ టికెట్ రేట్లుతో పోలిస్తే.. మల్టీఫెక్స్ ల్లో రూ.100, సాధారణ థియేటర్లలో రూ.55 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో 10 రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో రూ.40 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.