Salaar : సలార్ నుంచి ఫైట్ సీన్ లీక్..? మూవీ నిర్మాతల ట్వీట్ వైరల్..!

సలార్ మూవీ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యి బయటికి వచ్చాయి. అయితే తాజాగా ఫైట్ సీన్ లీక్ అయ్యిందంటూ ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Prabhas Salaar fight scene leak tweet producers reaction gone viral

Salaar : ప్ర‌భాస్, ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న మోస్ట్ హైపెడ్ మూవీ ‘సలార్’. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి డిసెంబర్ కి వెళ్ళింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుకుంటుంది. కాగా గతంలో ఈ మూవీ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యి బయటికి వచ్చాయి. అయితే తాజాగా ఫైట్ సీన్ లీక్ అయ్యిందంటూ ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఒక ప్రభాస్ అభిమాని.. ‘లీకైన సలార్ ఫైట్ సీన్ నా దగ్గర ఉంది. ఎవరికైన కావాలంటే నాకు మెసేజ్ చేయండి’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక దీనికి సలార్ నిర్మాతలు రియాక్ట్ అవుతూ.. ‘మాకు కూడా మెసేజ్’ చెయ్యి అంటూ రిప్లై రీట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో ఈ ట్వీట్స్ పై మీమర్స్.. మీమ్స్ చేస్తూ పోస్టులు వేస్తున్నారు.

Also read : Dil Raju : దిల్ రాజు తండ్రి మరణం.. పరామర్శించిన రామ్ చరణ్..

కాగా గతంలో రిలీజ్ చేసిన టీజర్ లో ప్రభాస్ పేస్ అసలు చూపించకపోవడంతో.. కనీసం ప్రభాస్ తో ఒక చిన్న టీజర్ వచ్చిన ఒకే అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే మూవీ టీం ట్రైలర్ నే సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు ఉన్న సంగతి తెలిసిందే. ఆ రోజునే ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. దీని గురించిన అప్డేట్ ని త్వరలోనే ఇవ్వనున్నారని సమాచారం.

ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ ‘సలార్-సీజ్ ఫైర్’ టైటిల్ తో వస్తుంది. డిసెంబర్ 22న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా, శ్రియారెడ్డి కీల‌క పాత్ర‌ను పోషించింది.