Prabhas Salaar Movie Beats Rajinikanth Jailer and Creates New Records
Salaar Vs Jailer : ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) సలార్ సినిమాతో గతవారం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పార్ట్ 1 సీజ్ ఫైర్ థియేటర్స్ లో భారీ విజయం సాధించింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని ప్రభాస్ అభిమానులకు సంతోషాన్ని ఇచ్చింది. సలార్ సినిమాతో ప్రభాస్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టిస్తున్నాడు.
సలార్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ ఏకంగా 178.7 కోట్ల గ్రాస్ ని అందుకొని సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఇక ఇప్పటివరకు సలార్ సినిమా ఏకంగా 550 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకుపోతుంది. థియేటర్స్ లో ఈ సినిమా ఇంకా సందడి చేస్తుంది. తాజాగా సలార్ సినిమా మరో రికార్డ్ బ్రేక్ చేసింది. ఇటీవల రజినీకాంత్(Rajinikanth) జైలర్(Jailer) సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Also Read : Hanuman : ‘హనుమాన్’లో ఆంజనేయ స్వామి పాత్రలో చిరంజీవి? డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఏమన్నాడంటే..
జైలర్ సినిమా కూడా దాదాపు 500 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. తమిళ్ లోనే కాక అన్ని భాషల్లో కూడా బాగా ఆడింది జైలర్. కర్ణాటకలో జైలర్ సినిమా కన్నడ వర్షన్ మొత్తం 5.71 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి కర్ణాటకలో ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన డబ్బింగ్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు సలార్ కర్ణాటకలో ఆ రికార్డ్ ని బ్రేక్ చేసింది. సలార్ కన్నడ వర్షన్ కర్ణాటకలో 5.80 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇంకా థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో కర్ణాటకలో ఆల్ టైం హైయెస్ట్ డబ్బింగ్ సినిమా కలెక్షన్స్ అయిన రజిని జైలర్ ని ప్రభాస్ తన సలార్ సినిమాతో బద్దలు కొట్టి సరికొత్త రికార్డ్ సెట్ చేశాడు.