Hanuman : ‘హనుమాన్’‌లో ఆంజనేయ స్వామి పాత్రలో చిరంజీవి? డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఏమన్నాడంటే..

హనుమాన్ ట్రైలర్ క్లైమాక్స్ ఆంజనేయస్వామి కళ్ళు తెరిచినట్టు ఓ షాట్ ఉంటుంది. అయితే అవి చిరంజీవి కళ్ళని అంతా అంటున్నారు.

Hanuman : ‘హనుమాన్’‌లో ఆంజనేయ స్వామి పాత్రలో చిరంజీవి? డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఏమన్నాడంటే..

Hanuman Movie Director Prashanth Varma Reaction on Chiranjeevi Role in Movie

Hanuman Movie : టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జ(Teja Sajja), టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Varma) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’. ఇప్పటికే ఈ సినిమా పైనుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయ్యి సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. సంక్రాంతికి జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అద్భుతమైన గ్రాఫిక్స్ తో, సరికొత్త కథతో హనుమాన్ సినిమాని ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నాడు.

అంజనాద్రి అనే ఓ ఊర్లో హన్మంతు అనే ఓ వ్యక్తికి ఆంజనేయ స్వామికి ఉన్న శక్తులు వస్తే ఎలా ఉంటుంది? తన ఊరిని ఎలా కాపాడుకుంటాడు అనే కథతో ఈ సినిమా రాబోతుంది. ఇటీవల రిలీజయిన ట్రైలర్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. ప్రతి షాట్ ఒక అద్భుతంలా ఉంది. ట్రైలర్ క్లైమాక్స్ ఆంజనేయస్వామి కళ్ళు తెరిచినట్టు ఓ షాట్ ఉంటుంది. అయితే అవి చిరంజీవి కళ్ళని అంతా అంటున్నారు.

దీంతో హనుమాన్ సినిమాలో చిరంజీవి గెస్ట్ అపియరెన్స్ చేశాడా? మెగాస్టార్ హనుమంతుడి భక్తుడు కాబట్టి నిజంగానే చేసి ఉంటాడు, ఆ కళ్ళు కచ్చితంగా చిరంజీవివే అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై ప్రశాంత్ వర్మని ప్రశ్నించగా దీని గురించి స్పందించాడు.

Also Read : VishwakSen Vs SKN : ‘కల్ట్’ వర్సెస్ ‘కల్ట్ బొమ్మ’.. విశ్వక్ సేన్, బేబీ నిర్మాతల మధ్య టైటిల్ వివాదం? ఎవరేమన్నారంటే?

ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. అవి ఎవరి కళ్ళు అనేవి నేను చెప్పను. ఈ సినిమా కోసం రెండున్నర ఏళ్ళు కష్టపడ్డాం. మీకు అవి చిరంజీవి కళ్ళలాగా అనిపించొచ్చు. కానీ దీనిపై నేనేమి మాట్లాడాను. సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అని అన్నారు. దీంతో అయితే ఆ కళ్ళు, ఆంజనేయ పాత్ర కూడా గ్రాఫిక్స్ తో చేశారా? అనే డౌట్ కూడా వస్తుంది. ఏదైతేనేం ఒక మంచి సినిమా మాత్రం రాబోతుందని ప్రేక్షకులకు అర్థమైంది.