Salaar : సలార్ సినిమాని దేశమంతా, ప్రపంచమంతా ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో తెలుసా? తెలుగు రాష్ట్రాల్లో..?

గత కొన్ని రోజులుగా రోజుకొకరు చొప్పున సలార్ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచమంతా ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ప్రకటించారు చిత్రయూనిట్.

Prabhas Salaar Movie Distributors across the World Full Details Here

Salaar Movie Distributors : ప్ర‌భాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) తెరకెక్కిస్తున్న ‘సలార్’ సినిమా కోసం టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు ఇండియా వైడ్ మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడిన సలార్ సినిమా పార్ట్ 1 సీజ్ ఫైర్ ని డిసెంబర్ 22న రిలీజ్ చేస్తామంటూ ఇటీవల మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ దగ్గర పడుతున్నా చిత్ర యూనిట్ మాత్రం ప్రమోషన్స్ పూర్తిస్థాయిలో మొదలు పెట్టడం లేదు. ఇటీవలే సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ట్రైలర్ డిసెంబర్ 1న రాత్రి 7.19 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

గత కొన్ని రోజులుగా రోజుకొకరు చొప్పున సలార్ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచమంతా ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ప్రకటించారు చిత్రయూనిట్.

కేరళలో పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్ హక్కులను తీసుకున్నాడు. తన పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమాని కేరళలో రిలీజ్ చేయబోతున్నాడు. పృథ్వీరాజ్ ఈ సినిమాలో విలన్ గా కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ సలార్ తమిళ్ హక్కులను తీసుకున్నారు. తన రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా సలార్ సినిమాని తమిళనాడులో డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు.

కర్ణాటకలో సలార్ సినిమా నిర్మాతలు హోంబలె ఫిలిమ్స్ స్వంతంగా సలార్ ని రిలీజ్ చేస్తున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఏరియాకి ఒకరు చొప్పున సలార్ సినిమా హక్కులను పలు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు తీసుకున్నాయి. ఉత్తరాంధ్ర హక్కులు శ్రీ సిరి సాయి సినిమాస్, ఈస్ట్ గోదావరి హక్కులు లక్ష్మి శ్రీనివాస మణికంఠ ఫిలిమ్స్, వెస్ట్ గోదావరి హక్కులు గీత ఫిలిం డిస్ట్రిబ్యూటర్, కృష్ణ&గుంటూరు హక్కులు KSN టెలీ ఫిలిమ్స్, నెల్లూరు హక్కులు శ్రీ వెంగమాంబ సినిమాస్, సీడెడ్ శిల్పకళా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు తీసుకొని సలార్ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు.

తెలంగాణ నైజాం హక్కులు మొత్తం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తీసుకుంది. సినిమాలు తెరకెక్కించే మైత్రి మూవీ మేకర్స్ ఈ సంవత్సరం మొదటి నుంచే సినిమాలని డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే పలు చిన్న, పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తుండగా ఇప్పుడు ప్రభాస్ సలార్ హక్కులను భారీ ధరకు దక్కించుకున్నారు. నైజాం కలెక్షన్స్ భారీగా వస్తాయని, మైత్రి వాళ్లకు ఫుల్ ప్రాఫిట్స్ వస్తాయని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.

ఇక నార్త్ ఇండియా మొత్తం సలార్ హక్కులని నిర్మాత అనిల్ తడాని తీసుకున్నారు. తన AA ఫిలిమ్స్ ద్వారా నార్త్ మొత్తం సలార్ సినిమాని రిలీజ్ చేయనున్నారు.

అలాగే భారతదేశం తప్ప ప్రపంచంలోని మిగిలిన అన్ని దేశాల్లో, ఇండియన్ సినిమా రిలీజ్ అయ్యే ప్రతి దేశం హక్కులని బాలీవుడ్ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫార్స్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయనున్నారు.

సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల కలెక్షన్స్ ని టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగనుంది. ప్రస్తుతం అభిమానులు ట్రైలర్ కోసం వేచి చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా, మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా, శ్రియారెడ్డి, మరికొంతమంది స్టార్ ఆర్టిస్టులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.