Salaar : ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు నిరాశ త‌ప్ప‌దా..? స‌లార్ పోస్ట్‌పోన్ కానుందా..?

ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న చిత్రం స‌లార్ (Salaar). ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్(Shruti Haasan) హీరోయిన్ గా న‌టిస్తోంది.

Salaar Postpone

Salaar Postpone : ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న చిత్రం స‌లార్ (Salaar). ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్(Shruti Haasan) హీరోయిన్ గా న‌టిస్తోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran), జగపతి బాబు(Jagapathi Babu) విలన్స్ గా, శ్రియారెడ్డి కీల‌క పాత్ర‌ను పోషించింది. సెప్టెంబ‌ర్ 28న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Ram Charan : రామ్ చరణ్ RC16లో చిరంజీవి కూడా నటిస్తున్నాడా..?

సినిమా విడుద‌ల‌కు మ‌రో 27 రోజులు మాత్ర‌మే స‌మ‌యం మాత్ర‌మే ఉంది. సెప్టెంబ‌ర్ 6న ట్రైల‌ర్ విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని బావిస్తుండ‌గా ఇప్పుడు ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. స‌లార్ సినిమా సెప్టెంబ‌ర్ 28కి విడుద‌ల కావ‌డం లేద‌ని, డిసెంబ‌ర్‌కు వాయిదా ప‌డింద‌నేది ఆ వార్త సారాంశం. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్తి కాక‌పోవ‌డ‌మే అందుకు కార‌ణం అట‌. సీజీ వ‌ర్క్ విష‌యంలో ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ అసంతృప్తితో ఉన్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Anushka Shetty : 14 భాష‌ల్లో రిలీజ్ కానున్న అనుష్క కొత్త సినిమా.. టీజ‌రే వెన్నులో వ‌ణుకుపుట్టిస్తోందిగా..!

అందుకే పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవుతుందని, దీంతో సినిమా విడుద‌ల‌ వాయిదా ప‌డ‌నుంద‌ని అంటున్నారు.  దీనిపై చిత్ర బృందం ఇప్ప‌టి వ‌ర‌కు అయితే ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అయితే.. చిత్ర బృందం ఇంకా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు మొద‌లుపెట్ట‌క‌పోవ‌డంతో రిలీజ్ వాయిదా ప‌డ‌నుంద‌నే రూమ‌ర్ల‌కు బ‌లం చేకూరుతోంది. అస‌లు విష‌యం ఏంటి అనేది మాత్రం చిత్ర బృందం స్పందిస్తేనే గానీ తెలియ‌దు.